వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత విశిష్టమైన, పవిత్రమైన స్థానం ఉంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధిస్తుంటాం. ఉదయాన్నే తులసి కోటకు పూజలు చేయడం, జలాన్ని సమర్పించడం, సాయంత్రం వేళ దీపం వెలిగించడం నిత్యకృత్యం. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఇంట్లో సరైన దిశ, స్థలంలో ఉంచడం అత్యవసరం. వీటికి భిన్నంగా అననుకూల స్థానాల్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తలెత్తే అవకాశం ఉంది.

చాలామంది భక్తిశ్రద్ధలతో తులసి మొక్కను ఇంట్లో పూజిస్తున్నప్పటికీ.. తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆశించిన ఫలితాలు పొందలేకపోతుంటారు. తులసిని సరైన పద్ధతిలో పూజించడమే కాకుండా, దానిని ఉంచే స్థలం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని నిర్దుష్ట ప్రదేశాలలో తులసి మొక్కను ఉంచకూడదని, అలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తీవ్రమౌతుందని, ఎదురవుతాయి.

Never place a sacred Tulsi plant in these Places Home and Vastu direction deep spiritual importance

వాస్తు ప్రకారం.. తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచకూడదు. దక్షిణ దిశకు అధిపతి.. యమధర్మరాజు. అందువల్లే ఈ దిశలో తులసిని ఉంచడం అశుభం. ఈ దిశలో తులసి మొక్కను ఉంచి, నిత్యం పూజించినా సానుకూల ఫలితాలు దక్కవు. అలాగే బెడ్‌రూమ్ లో కూడా తులసిని పెట్టకూడదు. తులసిని అక్కడ ఉంచడం వల్ల దాని దివ్యత్వం దెబ్బతింటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

సహజసిద్ధమైన గాలి, వెలుతురు రాని చీకటి గదులలో లేదా ఇంటి మూలల్లో తులసిని ఉంచకూడదు. దీనివల్ల మొక్క త్వరగా ఎండిపోతుంది. తులసి ఆరోగ్యంగా పెరగడానికి ఎండ చాలా అవసరం. పరిమిత స్థలం ఉన్నప్పటికీ, సహజమైన వెలుతురు వచ్చే చోటే మొక్కను ఉంచాలి. అలాగే వంటగది కిటికీలకు కూడా దగ్గరగా తులసి మొక్కను ఉంచకూడదు. కిచెన్ నుండి వచ్చే వేడి, పొగ వల్ల మొక్క దెబ్బతింటుంది.

గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో బాత్ రూమ్.. ఇంటి ఆవరణలో ఉంటుంది. అలాంటి ప్రదేశంలో వాటికి సమీపంలో తులసి కోటను నిర్మించకూడదు. అపవిత్రత ఉండే ప్రదేశాలకు తులసిని దూరంగా ఉంచాలి. ఇంట్లో చెత్త బుట్టలు లేదా వ్యర్థ పదార్థాలు వేసే చోట తులసిని పెట్టడం మంచిది కాదు. తులసి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో, అక్కడ మాత్రమే దైవత్వం ఉంటుంది. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

డూప్లెక్స్ తరహా ఇళ్లల్లో మెట్ల కింద ఉండే ఖాళీ స్థలాలలో మొక్కలను పెంచుతుంటారు. అలాంటి చోట మెట్ల కింద తులసి మొక్కను ఉంచకూడదు. మెట్ల కింద గాలి, వెలుతురు సరిగ్గా ఆడవు. అంతేకాకుండా, మెట్ల మీదుగా తిరుగాడుతుండటం వల్ల అక్కడ ధూళి చేరుతుంది. మొక్క పవిత్రత దెబ్బతింటుంది. వాస్తు ప్రకారం మెట్ల కింద స్థలం పవిత్రమైనది కాదు. అక్కడ పూజా గది, తులసి మొక్కను ఉంచడం ఎంతమాత్రం అనుకూలమైనది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తు ఆధారంగా తులసి మొక్కను నాటడానికి ఉత్తర, తూర్పు, ఈశాన్య దిశలు అత్యంత అనుకూలమైనవి. ఈశాన్య దిశలో తులసి మొక్కను ఉంచడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఉత్తరంలో పెడితే కుటుంబ శ్రేయస్సు మెరుగుపడుతుంది. ఈ దిశలలో మొక్కను నాటి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు పోయాలి. సాయంత్రం వేళ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనే నమ్మకం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+