తరుచుగా గోళ్లు కొరుకుతున్నారా?
మనకు పూర్వం నుంచి ఎన్నో ఆచారాలున్నాయి. ఏ పనులు ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? అనేవి ఒక నమ్మకం ఆధారపడి ఉండేవి. మన పెద్దలు ఏం చెప్పినా, ఏం చేసినా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరించేవారు. ఇప్పటికీ ఆ శాస్త్రాన్నే అనుసరిస్తున్నారు. ఈ ప్రకారం జీవితం నడుస్తుంటే ఆరోగ్యంతోపాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావించేవారు.
పెద్దలు చెప్పారు: మంగళవారం జట్టు కత్తిరించుకోకూడదని, గోర్లు కత్తిరించరాదనే ఆచారం ఉంది. ఎందుకు? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇంట్లోవారిని అడిగితే మన పెద్దవాళ్లు చెప్పారు. వారు ఒక ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. మనం కూడా చేయకూడదు అనే సమాధానం ఇస్తారుకానీ పూర్తి వివరాలు చెప్పలేరు. మానవ శరీరంపై మంగళవారం అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహం అధిక వేడిని కలిగి ఉండటంతో మనిషి శరీరంపై ప్రభావం కూడా వేడిగా ఉంటుంది.

రక్తాన్ని ప్రభావితం చేస్తుంది: ఇది రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ రోజు శరీరంపై ఎక్కువగా గాయాలవడానికి, గాట్లు పడటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ రోజు జట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదని ఆచారంగా వచ్చింది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంగళవారం అనేది హనుమంతుడికి సంబంధించినది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహానికి సంబంధించినది.
ఆయుష్షు తగ్గిపోతుంది: ఆదివారం రోజు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఆదివారం సాక్షాత్తు ఆ నారాయణుడికి అంకితం చేయబడిందని, ఆ రోజు జుట్టు, గోళ్ళు కత్తిరించడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందని చెబుతున్నారు. ఈరోజుల్లో చాలామంది నడుస్తూ గోళ్లు కొరుక్కోవడం, బస్సులో వెళుతున్నప్పడు, బండిమీద ప్రయాణించేటప్పుడు కూడా కొంతమంది గోళ్లు కొరుకుతుంటారు. కొందరు పళ్ల కింద వేలిని నమిలి గోళ్లను కొరకడం, చాలా మంది గోళ్లతో గోళ్లను కూడా కొరుకుతుంటారు. ఇలా అస్సలు చేయకూడదని, చేస్తే మన ఆరోగ్యంపై అనేక చెడు ప్రభావాలు కలుగుతాయంట. శనివారం గోర్లు కత్తిరిస్తే ఇంట్లో గొడవలు జరుగుతాయని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంటోంది.












Click it and Unblock the Notifications