వారఫలాలు: కాలం వ్యతిరేకంగా ఉంది.. అయినా నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది
గ్రహాలు నిర్ధేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. దీనివల్ల శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు.. రెండూ ఏర్పడతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీవరకు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏవైనా సమస్యలు ఏర్పడతాయా? వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? అందుకు తగిన మార్గాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
కర్కాటక రాశి : పనులు అనుకున్నస్థాయిలో త్వరగానే పూర్తవుతాయి. ఉద్యోగం బాగుండటంతోపాటు కొత్త బాధ్యతలు చేపడతారు. విశేష ధనలాభాలున్నాయి. కొత్తగా చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మూడో రాశిలో బుధుడు ఉండటంతో వ్యాపారంపై తగినంత శ్రద్ధ ఉండాల్సిందే. మాయమాటలతో మోసం చేసేవారితో జాగ్రత్తగా ఉండాలి. శివారాధాన కలిసివస్తుంది.

వృశ్చిక రాశి : బుద్ధిబలంతో పనిచేయాల్సి ఉంటుంది. మీకున్న ప్రతిభా పాటవాలే మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. పదవీ లాభం కనపడుతోంది. వ్యాపారం పలు మార్గాల్లో వృద్ధి చెందుతుంది. మాట్లాడే విషయాలను స్పష్టంగా చెప్పాలి. మిత్రుల వల్ల పనిని పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శక్తి లభిస్తుంది.
ధనుస్సు రాశి : భవిష్యత్తు శ్రేయోదాకంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉత్తమ ఫలితాలతో అదృష్టవంతులవుతారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. జీవితాశయాల్లో ఒకదాన్ని నెరవేరుస్తారు. పెట్టుబడులు లాభాలనిస్తాయి. మహాలక్ష్మిని ధ్యానించడంవల్ల శుభం జరుగుతుంది.
మకర రాశి : ధనయోగం ఉంది. అపార్థాలకు తావులేకుండా మాట్లాడుతుండాలి. దీనివల్ల అధికారులు సంతసిస్తారు. నిర్ణయాలు ధైర్యంగా తీసుకొని అమలు చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో ఆపదలు తొలగించుకుంటారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.
కుంభరాశి : కాలం వ్యతిరేకంగా ఉంది. లక్ష్యంపై దృష్టి పెట్టి పనిచేయాల్సి ఉంటుంది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తిచేస్తేనే అనుకున్నది సాధిస్తారు. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవాలి. బుద్ధిబలంతో విఘ్నాలను అధిగమించాల్సి ఉంటుంది. నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. నవ గ్రహ శ్లోకాలు పఠించడంవల్ల శుభం జరుగుతుంది.
మీనరాశి : ముఖ్యమైన పనులపై ఎంతో అప్రమత్తత అవసరం. అడుగడుగునా ఆటంకాలున్నాయి. అయినా ధైర్యంగా, వెనకాడకుండా, చెడు ఆలోచించకుండా పనులు పూర్తిచేయాలి. కొత్త ప్రయత్నాలకు ఇది మంచిది కాదు. ఒక పని చేతివరకు వచ్చి ఆగిపోతుంది. నిరాశ పడాల్సిన పనిలేదు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే ఆపదలన్నీ తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications