వారఫలాలు: ఈ రాశివారికి బ్రహ్మాండమైన వ్యాపార యోగం!

వేద జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దేశిత సమయంలో సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే సమయంలో ఆయా రాశిచక్రాల జాతకులకు శుభ ఫలితాలతోపాటు అశుభ ఫలితాలు కూడా కలుగుతుంటాయి. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎలా ఉంటుంది? అంతా సానుకూలమేనా? లేదంటే ఇబ్బందులంటే పరిష్కారాలేంటి? అనే విషయాలను రాశులవారీగా తెలుసుకుందాం.

తులా రాశి : వ్యాపార యోగం అద్భుతంగా ఉంది. ఆసక్తితో పనిచేయాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఏ విషయంలో కూడా చెడును ఊహించవద్దు. ఆపదలు తొలగుతాయి. సూర్యుణ్ని స్మరించాలి.

october 1st to 7th weekly horoscope

వృశ్చిక రాశి : కార్యసిద్ధిని సాధిస్తారు. కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో వృద్ధి ఉంది. ఆర్థికంగా మంచి సమయం. భూమితోపాటు వాహన యోగం ఉంది. పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. లక్ష్మీనారాయణులను స్మరించాలి.

ధనుస్సు రాశి : సకాలంలో పనులు ప్రారంభించడంవల్ల అనుకున్నది సాధిస్తారు. అధికార యోగం ఉంది. అనేక మార్గాల్లో పైకి వస్తారు. ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలే మంచి భవిష్యత్తును ఇస్తాయి. పార్వతీ పరమేశ్వరుల దర్శనం శుభప్రదం.

మకర రాశి : అనవసరమైనవాటి గురించి ఆలోచించకూడదు. సకాలంలో పనులు ప్రారంభించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో అధికారుల నుంచి మెప్పు లభిస్తుంది. పూర్వపుణ్యం కాపాడుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

కుంభరాశి : సకాంలో పనులు పూర్తిచేస్తేనే ఆటంకాలు తొలగిపోతాయి. ఉపయోగం లేకుండా ఏ పనీ చేయకూడదు. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థికంగా మిశ్రమంగా ఉంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి. శుభవార్తన వింటారు.

మీనరాశి : బ్రహ్మాండమైన వ్యాపార యోగం కనపడుతోంది. మనోభీష్టం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి. చెడును అసలు ఊహించవద్దు. వినయం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల అంతా మంచే జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+