ఓర్పుగా ఉండండి... నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ ఫలితాలతోపాటు కొన్ని అశుభ ఫలితాలను కూడా ఇస్తుంటాయి. అక్టోబరు 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వివిధ రాశులవారికి సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? సానుకూల ఫలితాలు లేక ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని ఎలా పరిష్కరించాలి? తదితర విషయాలను రాశిచక్రం ఆధారంగా పండితులు తెలియజేస్తున్నారు. రాశులవారీగా వారఫలాలను తెలుసుకుందాం.
తులా రాశి : సకాలంలో పనులు పూర్తిచేయడం ఎంతో ముఖ్యం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉద్యోగంలో ఉంటుంది. శుభ యోగం ఉంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలున్నాయి. విష్ణువును స్మరించడంవల్ల పని విజయవంతంగా పూర్తవుతుంది.

వృశ్చిక రాశి : ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. ధర్మమార్గంలో పయనించినప్పుడు విజయాలు లభిస్తాయి. అదృష్టం తోడుంటుంది. చెడును అసల ఊహాకు కూడా రానివ్వొద్దు. దుర్గాధ్యానం శుభప్రదం.
ధనుస్సు రాశి : సకాలంలో పూర్తిచేసిన పనులు విజయవంతమవుతాయి. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ధర్మమార్గంలో పనిచేయడంవల్ల అభివృద్ధి అనేది దానంతటదే వస్తుంది. పలు మార్గాల్లో ఆదాయం ఉంది. కొందరికి మీవల్ల మేలు కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారిని స్మరించడంవల్ల అదృష్టం వరిస్తుంది.
మకర రాశి : అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. స్వల్ప విఘ్నాలున్నా విజయం సొంతమవుతుంది. ప్రయత్నం బలం ముఖ్యంగా ఉండాలి. ఓర్పు గా ఉంటే లక్ష్యానికి చేరువవుతారు. సత్యనిష్ఠతో ముందుకు సాగండి. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.
కుంభరాశి : ధర్మబద్ధంగా పనులు ప్రారంభించాలి. నిజాయితీ కాపాడుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. వారం మధ్యలో ఒక విజయం ఉంది. మీ మాటను నలుగురూ గౌరవిస్తారు. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల కార్య సిద్ధి ఉంది.
మీనరాశి : ఉద్యోగంలో, వ్యాపారాల్లో ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అనాలోచితంగా ఏ పని చేయకూడదు. సహృదయుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. ఎదురయ్యే విఘ్నాలను బుద్ధిబలంతో ఎదుర్కోవాలి. ఈర్ష్యకు గురయ్యేవారు మీపై నిందలు మోపుతారు. మౌనంగా ఉండటంవల్ల మేలు కలుగుతుంది. నవగ్రహ శ్లోకాలను పఠించాలి.












Click it and Unblock the Notifications