ఈ రాశులను బృహస్పతి మాత్రమే కాపాడగలుగుతారు.. లేదంటే మునిగిపోతారు!

దేవతల గురువైన బృహస్పతి నవగ్రహాల్లో కీలక గ్రహం. శ్రేయస్సును, వివాహాన్ని సంతానాన్ని, ఆధ్యాత్మికతకు కారకుడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేస్తాడు. గురువు ఈ నెల 18వ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల మూడు రాశులపై ప్రభావం పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని ఆర్థిక కష్టాలు కలుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని, అనారోగ్య సూచనలున్నాయని హెచ్చరిస్తున్నారు.

వృషభ రాశి
ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఎవరితోను అతిగా మాట్లాడొద్దు. లేదంటే నష్టాలు కలుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తాయి. అనుకోకుండా ఖర్చులు పెరిగి భారమవుతాయి. ఎంత మౌనంగా ఉంటే అంత కలిసివస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించాలి.

Only Jupiter can save these zodiac signs otherwise they will drown

సింహరాశి
ఎవరికైనా డబ్బులిచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. తర్వాత సమస్యలు వస్తాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రత్యర్థులకు అవకాశాలు ఇవ్వకూడదు. రావాల్సిన డబ్బులు కూడా చేతికి రావు. రహస్యాలనేవి మనసులో ఉంచుకోవాలి. అయితే ఎవరికైనా చెబితే ఆర్థిక నష్టాలుంటాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ రాశివారు కూడా శివాలయంలోకానీ, ఆంజనేయస్వామి ఆలయంలోకానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బృహస్పతిని పూజించాలి.

కుంభ రాశి
ప్రత్యర్థులు వీరిపై విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా గ్యాస్ సమస్య వస్తుంది. ఇతరులకు డబ్బులివ్వడం, ఇతరుల నుంచి డబ్బులు తీసుకోవడం మానేయాలి. అనారోగ్యం కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఏ పని తలపెట్టినా కష్టం తప్పదు. ఒకరకంగా ఈ రాశివారికి చెడు సమయం ప్రారంభమైందని చెప్పొచ్చు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్లి గురువును పూజించడంవల్ల, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంవల్ల ఇబ్బందుల నుంచి బయటపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+