వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈరాశి వారికి ఏదో ఒక రూపంలో చేతికి డబ్బు అందుతుంది

ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది కాబట్టి ఎక్కడా ఆర్థికంగా ఇబ్బంది పడరు.

|
Google Oneindia TeluguNews

ఈ సంవత్సరం కుంభ రాశి వారికి గురువు మీ రాశికి రెండవ స్థానమైన మీన రాశిలో ఏప్రిల్ 22 వరకు ఉంటాడు. ఆ తర్వాత 3వ స్థానమైన మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. కేతువు 9వ స్థానమైన తులా రాశి నుంచి 8వ స్థానమైన కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలం

ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలం

ఈ సంవత్సరం కుంభ రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురు గోచారం ఏప్రిల్ వరకు బాగుంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. మీ ఉద్యోగ, వ్యాపారాల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మీకు ఈ సంవత్సరం నుంచి అవి తొలగిపోవడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఏడాది మొత్తం శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చు ఎక్కువగా అయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడరు.

ఆర్థికంగా ఇబ్బంది పడరు

ఆర్థికంగా ఇబ్బంది పడరు

ఏదో ఒక రూపంలో మీ చేతికి డబ్బు అందుతుంది కాబట్టి ఎక్కడా ఆర్థికంగా ఇబ్బంది పడరు. వ్యాపారం చేయాలనుకునేవారు, పెట్టుబడి పెట్టాలనుకునేవారు, ఇల్లు కొనాలనుకునేవారు ఈ సంవత్సరం ప్రథమార్థంలో డబ్బు ఖర్చు పెట్టడం మంచిది. గురు గోచారం అనుకూలంగా ఉండటంవల్ల మీరు పెట్టే పెట్టుబడికి భవిష్యత్తులో మంచి ఆదాయం లభిస్తుంది. ఏప్రిల్ తర్వాత గురు గోచారం 3వ ఇంటికి మారడంవల్ల పెట్టుబడి పెట్టడం మంచిది. గురువు దృష్టి 7, 9, 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి ఆదాయం లభిస్తుంది.

కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు

కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు


కోర్టు కేసుల్లోకానీ, ఆస్తి వివాదాల్లోకానీ అనుకూలమైన ఫలితం రావడవల్ల డబ్బుకానీ, ఆస్తులుకానీ కలిసివచ్చే అవకాశం ఉంటుంది. అక్టోబరు నెల చివరి వరకు రాహు గోచారం అనుకూలంగా ఉండటంతో వృత్తిపరంగా అభివృద్ధితోపాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. ఈ ఏడాది చివరలో రాహు, కేతు గోచారం అనుకూలంగా ఉండదు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతోపాటు ఇతరులకు డబ్బులిచ్చి మోసపోవడం జరుగుతుంది. ఈ సమయంలో చేసే ఆర్థిక వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి పెట్టుబడి పెట్టడం, వ్యక్తిగత అవసరాల నిమిత్తం, జీవిత భాగస్వామి కోసం, ఇంటి అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు.

గురుబలం సామాన్యం ఉండే సమయం

గురుబలం సామాన్యం ఉండే సమయం


ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు, జూన్ 15 నుంచి ఆగస్టు 17 మధ్యలో, సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 18 మధ్యకాలంలో డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది. ఈ సమయంలో ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు పెట్టడం కానీ, ఇల్లు మొదలైన స్థిరాస్తులు కొనుగోలు చేయటం కానీ ఏమాత్రం మంచిది కాదు. ఏప్రిల్ 14 నుంచి మే 15 మధ్యలో, జూలై 15 నుంచి ఆగస్టు 17 మధ్యలో, డిసెంబర్ 16 నుంచి సంవత్సరం చివరి వరకు సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది. చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారుఈ సమయంలో చేయవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో వారి గురుబలం సామాన్యంగా ఉంటుంది.

English summary
This year will be financially favorable for those born under the sign of Aquarius
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X