నాలుగు వస్తువులను నాలుగు దిక్కుల్లో ఉంచితే వాస్తు దోషాలు పోయి సంపద పెరుగుతుంది
వాస్తు శాస్త్రాన్ని 99 శాతం మంది అనుసరిస్తారు. నాస్తికులు మాత్రం అనుసరించరు. వాస్తు శాస్త్రం అనేది మన భారతీయ పురాతన శాస్త్రం. రుషులు మనకు దీన్ని అందించారు. కట్టడ నిర్మాణం ఏదైనా వాస్తు ప్రకారం నిర్మిస్తే జీవితం సజావుగా సాగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు సమస్యలు వస్తుంటాయి. ఆర్థిక రూపంలో కావొచ్చు, అనారోగ్యం రూపంలో కావొచ్చు.. ఇలా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. వాస్తు దోషం ఉంటే సరిచూసుకొని పరిష్కరించుకోవాలి. దిక్కులను వాస్తు ప్రకారం అనుసరించడంవల్ల సంపద వస్తుంది. శ్రేయస్సు కలుగుతుంది.
దక్షిణ దిశ
ఇంటికి దక్షిణం వైపు పసుపు రంగులో ఉన్న బంతిపూలను ఉంచాలి. దీనివల్ల మీకు అధిక డబ్బు వస్తుంది. అలాగే ధనప్రవాహం కూడా పెరుగుతుంది. సంపద పెరగాలంటే ఈ చిట్కాను మీరు పాటించాలి.

తూర్పు దిశ
ఇంటికి తూర్పు దిశలో వెండి చేపను ఉంచాలి. లేదంటే క్రిస్టల్ చేపను అయినా ఉంచొచ్చు. దీనివల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. సంపద రావడమే కాకుండా ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తి బయటకు వెళిపోతుంది. సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
పశ్చిమ దిశ
ఇంటికి పశ్చిమ భాగం అనేది ఆంజనేయుడి నివాసం. ఆ దిక్కుగా హనుమంతుడికి చెందిన ఒక చిన్న గదనైనా ఉంచాలి. దీనిల్ల కుటుంబంలోని కష్టాలన్నీ దూరమవుతాయి. అంతేకాదు.. వాయుపుత్రుడి నుంచి ఆశీస్సులు లభించి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి.
ఉత్తర దిశ
ఉత్తర దిశలో కుబేరుడికి సంబంధించిన విగ్రహంఉండాలి. అది వీలు కాకపోతే కనీసం కుబేరుడి ఫొటో అయినా ఉంచాలి. దీనివల్ల ఇంట్లోకి ధనప్రవాహం మొదలవుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తోడుతాయి. అనేక అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగిం చేసుకోవాలి. ఇంటికి శ్రేయస్సు కలుగుతుంది.












Click it and Unblock the Notifications