వాస్తు ప్రకారం.. తులసి మొక్క నాటే సమయంలో పాటించాల్సినవి

హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి ఇంట్లోనూ తులసి కోటను పూజించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. తులసిని సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ కుటుంబంలో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిని నాటేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం ఎంతో ముఖ్యం. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రతికూల శక్తులు ప్రవేశించే ప్రమాదం ఉంది.

వాస్తు ప్రకారం ఏ రోజు పడితే ఆ రోజు తులసి మొక్కను నాటకూడదు. అలాగే ఆకులను కోసే విషయంలోనూ కొన్ని నిషేధాలు ఉన్నాయి. ఇంట్లో నూతనంగా తులసి మొక్కను నాటాలనుకుంటే.. వాస్తు నియమాలు, రోజులు, ఆకులు కోయడానికి గల సమయాలు, దిశల గురించి వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Plant Tulsi on these day and this directions for Maximum Auspiciousness and Blessings as per vastu

వాస్తు ప్రకారం తులసి మొక్కను నాటడానికి గురువారం, శుక్రవారం అత్యంత అనుకూలమైన రోజులుగా పరిగణిస్తారు. గురువారం శ్రీమహావిష్ణువుకు ప్రియమైన రోజు కాగా, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ముఖ్యమైనది. ఈ రోజుల్లో తులసిని నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం తులసి మొక్కను నాటడానికి అత్యుత్తమ రోజులు. ఈ మాసంలో తులసి పూజలు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?
వాస్తు ప్రకారం.. ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ స్టవ్ వాడవచ్చా?

తులసి మొక్కను నాటడానికి ఆది, సోమవారం, ఏకాదశి తిథులు అనుకూలం కావు. తులసి మొక్కను నాటడం కానీ, తాకడం కానీ చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటితో పాటు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సందర్భాలు, పితృ పక్షాలు, హోళీ దహనం రోజున తులసి మొక్కలను కొనుగోలు చేయడం లేదా నాటడం వంటి పనులు చేయకూడదు.

వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

వాస్తు ప్రకారం తులసి మొక్కను ఉంచే దిశ ఇంటి పురోగతిని నిర్ధారిస్తుంది. ఇంటికి ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలను తులసి మొక్కకు అత్యంత అనుకూలమైన స్థానాలుగా చెప్తారు. ఈ దిశలలో తులసి ఉండటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుందనే విశ్వాసం ఉంది. ఇల్లు విశాలంగా ఉంటే అక్కడ మధ్యలో తులసి కోటను నిర్మించడం ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ అపార్ట్‌మెంట్లలో నివసించే వారైతే, తులసిని బాల్కనీలో తూర్పు లేదా ఉత్తర దిశ వైపు అమర్చుకోవచ్చు. మొక్కకు తగినంత గాలి, వెలుతురు లభించేలా చూసుకోవాలి.

వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!
వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!

తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో ఉంచకూడదు. దక్షిణ దిశను యమధర్మరాజుకు స్థానంగా భావిస్తారు. ఆ దిశగా తులసిని ఉంచడం వల్ల ఇంట్లో కష్టాలు, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తులసి ఆకులను కోసేటప్పుడు కూడా కొన్ని నియమాలను అనుసరించాలి. ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులలో తులసి ఆకులను తుంచకూడదు. సూర్య సంక్రాంతి రోజులు, రాత్రి వేళల్లో తులసి ఆకులను కోయకూడదు.

అర్ధరాత్రి వేళల్లో తులసిని తాకడం గానీ, అపవిత్ర సమయాల్లో మొక్క దరిదాపుల్లోకి వెళ్లడం గానీ చేయకూడదు. ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే, దాని స్థానంలో వెంటనే మరో నూతన మొక్కను నాటాలి. ఎండిపోయిన పాత తులసి కొమ్మలను పారే నీటిలో లేదా నదిలో కలపాలి. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+