గర్భిణీ స్త్రీలు బీ కేర్ ఫుల్.. ఈ నెలలోనే రెండు గ్రహణాలు

హిందూ మత విశ్వాసం ప్రకారం.. గ్రహణ సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఆ సమయంలో ఎటువంటి పూజలు, శుభ కార్యాలు నిర్వహించరు. అంతే కాకుండా గ్రహణ సమయంలో కొన్ని పనులను కూడా చేయరు. అలానే ఆ సమయంలో దైవ నామ స్మరణ చేస్తూ ఉండడం వల్లదుష్ఫలితాలు తగ్గుతాయని కూడా నమ్ముతారు. ముఖ్యంగా స్త్రీలు కూడా గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ ఉంటారు.

ఇక గ్రహణాలు రావడం అనేది సర్వసాధారణ విషయమే. పౌర్ణమి, అమావాస్య తిథిలో సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఏడాదిలో కూడా సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. కానీ ఈ నెలలోనే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రాబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Pregnant women be careful Two eclipses in this month

ఈ నెలలో వచ్చే పౌర్ణమి తిథి అనగా.. 14వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడునుంది. అలానే 29వ తేదీ, అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇలా ఈ రెండు కూడా ఒకే నెలలో రావటంతో గర్భిణీలు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అందుకే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. అలాగే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినకుండా.. గ్రహణం పూర్తి అయిన తర్వాత తల స్నానం చేసి ఆహారం వండుకొని తినడం మంచిదని వెల్లడించారు.

అయితే మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడే సమయం ఉదయం. కాబట్టి, ఇది మన ప్రజలకు కనిపించదు. అమెరికా, పశ్చిమ యూరప్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక సూర్య గ్రహణం కూడా మన దేశ ప్రజలకు కనిపించదని ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, యూరప్ ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుందని చెబుతున్నారు. కానీ ఒకే నెలలో రెండు గ్రహణాలు రావడం మన దేశంపై కూడా కొంత ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+