నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం ముహూర్తం ప్రత్యేకత ఏమిటో తెలుసా?
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మూడోసారి కూడా ఎన్డీయే కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించడంలో 9వ తేదీ సాయంత్రం 7.15 గంటలకు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ముహూర్తం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం. 9వ తేదీన రవియోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రమాణ స్వీకారం చేయడంవల్ల విజయానికి ప్రతీకగా నిలవడమే కాకుండా దోషాలన్నీ తొలగిపోతాయి. రవి యోగం విజయానికి ప్రతీకగా నిలుస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
పుష్యా నక్షత్రంలో రవి పుష్య యోగం
దివారం పుష్యా నక్షత్రం సందర్భంగా రవి పుష్య యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసినా కలిసివస్తుంది. ప్రధానంగా యోగంలో బృహస్పతి, సూర్యుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండూ విజయానికి, శక్తికి, మేథస్సుకు ప్రతీకగా నిలుస్తాయి. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్ధి యోగం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా మెరుగైన ఫలితాలు రావడమేకానీ తగ్గడం అంటూ ఉండదు. ఆ పనికి ఎటువంటి అడ్డంకులు ఏర్పడవు. నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న మాసం జ్యేష్ట మాసం, తృతీయ తిథి. కాబట్టి దీన్ని అభివృద్ధికి సూచికగా భావిస్తారు.

సర్వార్థ సిద్ధి యోగం కూడా..
జూన్ 10వ తేదీ రాత్రి 8:20 నుంచి ఆ తర్వాత రోజు తెల్లవారుజాము వరకు సర్వార్ధ సిద్ది యోగం ఉంటుంది. ఇది కూడా ఎంతో మంచి సమయం. ఈ సమయంలో ఎటువంటి పనులు తలపెట్టిన అదృష్టం తోడుండి అన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. పుష్యా నక్షత్రం అన్ని నక్షత్రాలకంటే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఆరోజు పునర్వసు నక్షత్రంలో కొత్త పనులు ప్రారంభించడం మంచిదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications