Pushya Masam 2023:పుష్య మాసం విశిష్టత ఏంటి.. ఏ దేవున్ని పూజించాలి..?

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

డిసెంబర్ 24 శనివారం పుష్య మాసం ప్రారంభం అయ్యింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది.విష్ణువుకు ఇష్టమైన మాసం మార్గశిరం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.

శని ధర్మదర్శి. న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠులు పాటించి నట్లయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేగాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్ప బడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహంచాలి. పుష్యమాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాల తోనూ. ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు.

Pushya masam is very much connected with lord shani

మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది. ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. పుష్య మాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ , ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరా యణం ప్రారంభమవుతుంది.

సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకా దశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణౖకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటి లోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి.

పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృ దేవతల అనుగ్ర#హం కలుగుతుంది. పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయిం చే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వ ముఖముగా ప్రయాణము. మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్య కిరణములయందు ఒక ప్రత్యేకమైన హరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టు కున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+