సరిగ్గా నెలరోజుల్లో ఈ రాశులవారికి లాటరీ తగిలినంత అదృష్టం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలోనే ఈ రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించబోతున్నాడు. మార్చి 14న మీనంలోకి రానున్నాడు. ఈ సందర్బంగా కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు జరుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రవి మకర రాశిలో ఉన్నాడు. ఈ మార్పులవల్ల వృషభ రాశి, సింహ రాశి, మకర రాశులవారికి మంచి ప్రయోజనాలు దక్కనున్నాయని చెబుతున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.

వృషభ రాశి : రాహువు, సూర్యుడి కలయిక ఈ రాశులవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ధనలాభం ఉంది. ఖర్చుల విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. వాటిని తగ్గించుకోవాలి. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వైవాహిక జీవితం అన్నతర్వాత కొన్ని ఒడిదుడుకులు సహజం. పంతాలు, పట్టింపులు, పట్టుదలకు పోకుండా వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటేనే ఆ బంధం నిలుస్తుంది.

ravi and rahu transit 3 zodiac sign people get good benefits

సింహ రాశి : ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ తరుణంలోనే ఆదాయం కూడా పెరుగుతుంది. ఆదాయ ఆర్జనకు అదనపు మార్గాలను అన్వేషించాలి. పాత పెట్టుబడుల నుంచి రాబడిని పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు లేదంటే ఆధ్యాత్మిక పరమైన యాత్రలకు వెళ్లడానికి అవకాశం ఉంది.

మకర రాశి : ఈ రాశివారికి ఆనంద దాయకంగా జీవితం గడుస్తుంది. సమాజంలో స్టేటస్ పెరుగుతుంది. కెరీర్ కు సంబంధించి వాదనల్లో పాల్గొనకూడదు. దీనివల్ల శత్రువులు ఏర్పడతారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడంవల్ల ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+