I, Nobody మూవీ రివ్యూ: పృథ్వీరాజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?
మలయాళం నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన నటుడిగా అనేక సినిమాల్లో తన సత్తా ఏంటో చూపించారు. అటు దర్శకుడిగానూ లూసిఫర్, లూసిఫర్ 2 చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో 'రణకుంభ' అనే విలన్ పాత్ర చేస్తున్నారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ I, Nobody ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధానపాత్రలో పార్వతి తిరువోతు, హక్కిమ్ షాజహాన్, అశోకన్, విజయ రాఘవ్ తదితరులు కీలక పాత్రలో నటించిన మూవీ I, Nobody.. ఈ చిత్రానికి నిషమ్ బషీర్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే రాజీవ్(పృథ్వీరాజ్ సుకుమారన్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు భార్య మీరా(పార్వతి) అలాగే ఇద్దరు పిల్లలు ఉంటారు. అయితే బ్యాంక్ ఉద్యోగి అయిన రాజీవ్ ఓసారి తన ప్రమేయం లేకుండానే దోపిడీ వ్యవహారంలో చిక్కుకుంటారు.
ఆ తర్వాత నేరం చేసిన వ్యక్తులు మరణిస్తారు. కానీ ఈ కేసులో దోషిగా రాజీవ్ ను పోలీసులు అనుమానిస్తారు. అతని వద్దే కోట్ల డబ్బు ఉందన్న ప్రచారం నడుస్తూ ఉంటుంది. అటు సామాజిక మాధ్యమాల్లోనూ రాజీవ్ పై గట్టిగానే ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యల మధ్య రాజీవ్ ఎలా భయటపడతాడు..? చివరకు ఎలా నిర్దోషిగా బయటకు వస్తాడు..? అనేదే స్టోరీ..

మూవీ విశ్లేషణ విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్ లోని మనీ హీస్ట్ వెబ్ సిరీస్ మనకు గుర్తుకు వస్తుంది. దోపిడీకు ముందు ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతాయి. ఇక ఫస్టాఫ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సీన్లు బాగా ల్యాగ్ అయినట్లు కనిపిస్తాయి. కానీ కథలో ఊహించని ట్విస్టులు ఆశ్చర్య పరుస్తాయి. అలాగే మూవీలో సంగీతం, సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే సెకండాఫ్ లో మూవీ బాగా ల్యాగ్ అవుతుంది. రన్ టైమ్ కూడా పెద్ద మైనస్ గా ఉంటుంది. ఫస్టాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండాఫ్ లేకపోవడంతో మూవీ దెబ్బకొట్టింది.












Click it and Unblock the Notifications