ఇంజినీరింగ్ విద్యార్ధినిలకు లక్కీ ఛాన్స్.. ఏడాదికి రూ.50వేలు స్కాలర్ షిప్ !!
ప్రముఖ "షెఫ్లర్ ఇండియా" సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినులను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు "షెఫ్లర్ ఇండియా హోప్ ఇంజనీరింగ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం 2026" కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ (B.Tech/BE) చదువుతున్న విద్యార్థినులకు నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నారు. అంతే కాకుండా ప్రొఫెషనల్స్ ద్వారా మెంటర్‌షిప్ సపోర్ట్ కూడా అందించనున్నట్టు అనౌన్స్ చేశారు. అర్హత గల విద్యార్థినులు ఆగస్టు 15వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.
అర్హతలు
ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాం కోసం భారతదేశంలోని UGC/రాష్ట్ర ప్రభుత్వం/AICTE గుర్తింపు పొందిన కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న మహిళా విద్యార్థి అయి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్ (సైన్స్ స్ట్రీమ్)లో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. దివ్యాంగ (PwD) విద్యార్థినులైతే కనీసం 40% మార్కులు ఉంటే సరిపోతుంది. అలానే సదరు విద్యార్ధిని కుటుంబ వార్షిక ఆదాయం రూ.5,00,000 మించకూడదని స్పష్టం చేశారు. Schaeffler India లేదా Buddy4Study ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు కారని క్లారిటీ ఇచ్చారు. దివ్యాంగ (PwD) విద్యార్థినులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

ఏ ఏ బ్రాంచుల్లో విద్యార్థినులు అర్హులంటే :
ఆటోమొబైల్ ఇంజినీరింగ్
మెకానికల్ ఇంజినీరింగ్
మెకాట్రానిక్స్
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE)
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE)
ప్రొడక్షన్ ఇంజినీరింగ్
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (CSE)
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)
స్కాలర్‌షిప్ ప్రయోజనాలు..
ఎంపికైన విద్యార్థినులకు ప్రతి సంవత్సరం రూ.50,000 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్ అందించనున్నారు. Schaeffler India నిపుణుల నుంచి మెంటార్‌షిప్, కెరీర్ గైడెన్స్ లభించనుంది.
దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్
దరఖాస్తు గడువు..
చివరి తేదీ: 15 ఆగస్టు 2026
పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ www.b4s.in/yeks/SIHE17 సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications