ఆ అభిమాని అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదు? మౌనం వీడిన హీరో యశ్!
'కేజీఎఫ్' ఫేమ్, కన్నడ సూపర్ స్టార్ యశ్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలైన 'టాక్సిక్' , 'రామాయణ్' సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయనకు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. యశ్ తన అభిమానులను చాలా ప్రేమిస్తారు. కానీ 2021లో జరిగిన ఓ విషాద ఘటన ఆయనను తీవ్రంగా కుదిపేసింది. ఆయన 25 ఏళ్ల అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నప్పుడు తన అంత్యక్రియలకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, సూపర్ స్టార్ యష్ హాజరు కావాలని అతను తన చివరి కోరికను వెల్లడించాడు.
సిద్ధరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు, కానీ యశ్ హాజరు కాలేదు. అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంతో అప్పట్లో యశ్‌పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కొన్నేళ్ల తర్వాత.. యశ్ ఈ విషయంపై తన మౌనాన్ని వీడి.. తాను అంత్యక్రియలకు ఎందుకు హాజరు కాలేదో స్పష్టమైన కారణాన్ని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. అభిమాని చనిపోయినందుకు చాలా బాధగా అనిపించిందని.. కానీ ఇలా చేస్తే తమ అభిమాన హీరో యశ్ వస్తాడనే ఆలోచన తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో తాను అంత్యక్రియలకు వెళ్తే అలాంటి తప్ప ఇంకా చాలా మంది చేయొచ్చని.. అందుకే వెళ్లలేదని అసలు కారణాన్ని తెలిపాడు. అభిమానులు ఏదైనా సాధించి రమ్మంటే వెళ్లడానికి ప్రయత్నిస్తానని.. కానీ ఇలాంటివి అస్సలు ప్రోత్సహించనన్నారు. తన బాధ్యత ఏంటో అర్థం చేసుకుని తాను ఆ సమయంలో నిర్ణయం తీసుకున్నానని యశ్ వెల్లడించాడు.

ఆగష్టు 26న టాక్సిక్ విడుదల
సినిమాల విషయానికి వస్తే యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టాక్సిక్' చిత్రం ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి మార్చిలో 'ధురందర్ 2'తో పాటు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. జూన్‌లో విడుదల అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. చిత్ర నిర్మాతలు చివరకు ఆగస్టు 26వ తేదీని ఖరారు చేశారు.
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ పాన్-ఇండియా ప్రాజెక్ట్. ఇందులో యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ నటించారు. ఈ సినిమా ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాల కారణంగా కూడా ఇది వార్తల్లో నిలిచింది. ఇప్పుడు, శ్రద్ధా కపూర్ నటించిన 'ఇతా' చిత్రం విడుదల తేదీ వాయిదా పడటంతో, 'టాక్సిక్' ఆగస్టు 26న సోలోగా విడుదల కానుంది.
Yash is Trending in the US because the Indian actor has explained that he skipped the 2021 funeral of a fan who died by suicide because he feared his attendance would set a dangerous precedent, encouraging others to believe that taking extreme measures would attract celebrity… pic.twitter.com/9Q25mWDJND
— Why It Is Trending (@trendingblog247) August 14, 2026














Click it and Unblock the Notifications