ఆస్ట్రేలియాలో మోడీని వెంటాడుతున్న వ్యక్తి..! ఇవాళ హోటల్లోకి దూసుకెళ్లి ..!

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకముందే ప్రాణహాని బెదిరింపులు ఎదుర్కొన్న మన ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)కి అక్కడికి వెళ్లాక కూడా మనస్సాంతి లేకుండా పోతోంది. ఇవాళ ఆయన మెల్ బోర్న్ లో బస చేసిన హోటల్లో చోటు చేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక నిరసనకారుడు ఒకరు మోడీ బస చేసిన హోటల్లోకి దూసుకెళ్లి కలకలం రేపాడు. దీంతో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

140 కోట్ల భారతీయుల తరఫున చెప్తున్నా..! ట్రంప్ కు మోడీ మెసేజ్..!
140 కోట్ల భారతీయుల తరఫున చెప్తున్నా..! ట్రంప్ కు మోడీ మెసేజ్..!

రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ ఆస్ట్రేలియాకు వచ్చిన కొన్ని గంటలకే.. వామపక్ష భావజాలం కలిగిన ఓ వలస వ్యతిరేక నిరసనకారుడు మెల్ బోర్న్ లో ఆయన బస చేస్తున్న హోటల్‌లోకి బలవంతంగా చొరబడ్డాడని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషిస్తూ నినాదాలతో అడ్డుకున్నాడు. అదే వ్యక్తి తాజాగా మెల్ బోర్న్ లోని మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగానికి అంతరాయం కలిగించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ ఉత్సవాల్లో పాల్గొన్నవారు వాయిస్తున్న సంగీతంలో అతని మాటలు వినిపించకపోవడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు.

Anti-Immigration Protester Enters PM Modi s Melbourne Hotel Triggers Security Concern Amid death Threats
PM Modi: ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం..! మోడీకి వార్నింగ్ ..!
PM Modi: ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తాం..! మోడీకి వార్నింగ్ ..!

ఆస్పిల్ అనే మారుపేరుతో ఆన్‌లైన్‌లో పనిచేసే హ్యూగో లెనన్ అనే ఈ నిరసనకారుడు.. హోటల్ లాబీలోని రెడ్ కార్పెట్‌పైకి ప్రధాని మోదీ రాగానే ఆయనపై అరుస్తూ కనిపించాడు. పై అంతస్తులో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండగా, అక్కడి నుండి అతను ఫక్ మోదీ! అని అరిచాడు. ఇది ఆస్ట్రేలియా, ఇకపై భారతీయులు వద్దు, మాకు వలసలు వద్దు, ఈ దేశం ఆస్ట్రేలియన్లది, అంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే అతన్ని చుట్టుముట్టి, లాబీకి ఎదురుగా ఉన్న మొదటి అంతస్తు బాల్కనీ నుండి ఈడ్చుకెళ్లారు. దీంతో ఆస్ట్రేలియాలో మోడీ టూర్ మొత్తం లీక్ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+