ఏలినాటి శని ఉంటే రేపు శనివారం ఇలా చేయండి
జ్యోతిష్యం ప్రకారం శనిదేవుడు న్యాయమూర్తి, కర్మదాత. మనం చేసిన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు ఇస్తాడు. కొన్ని పనులు చేయడంద్వారా శనిదేవుడి అనుగ్రహం పొందొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే శనిదేవుడి సంచారాన్ని కూడా జ్యోతిష్య పండితులు ప్రత్యేకంగా భావిస్తారు.
శనివారం పేదలకు దానం చేయండి
ఏలినాటి శనితో బాధపడేవారు ప్రతి శనివారం శని దేవుడిని పూజించాలి. నూనె, నువ్వులు, నల్లటి వస్త్రాలను శనిదేవుడికి సమర్పించుకోవాలి. నవగ్రహ శాంతికి, శనిదోష నివారణకు పూజలు చేయించుకోవాలి. శనివారంనాడు హనుమాన్ జయంతి వస్తే ఆరోజు హనుమంతుడిని పూజిస్తే చాలా మంచిది. ఆయనకు తమలపాకులతో చేసిన పూలమాలను సమర్పిస్తే ఎంతో శుభప్రదం. శనివారంరోజు పేదలకు ఏవైనా దానం చేయాలి. నూనెతోపాటు నువ్వులు, బెల్లం, గోధుమలు, నల్లటి వస్త్రాల్లాంటివి దానం చేస్తే శని అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ ఆచరించడంవల్ల శనిదేవుడి దోషాల నుంచి విముక్తి లభించడంతోపాటు.

శని వ్రతం చేస్తే మంచిది
శనివారం శని వ్రతం ఆచరించడం వల్ల శని దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏలినాటి శని ఉన్నవారు శని వ్రతం చేయడంవల్ల అనేక లాభాలను అందుకుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో దానం చేయాలి. ప్రతి శనివారం, మంగళవారం హనుమాన్ చాలీసాను పారాయణం చేయడంవల్ల చెడు ప్రభావాల నుంచి దూరంగా ఉంటారు. అలాగే సుందరకాండను చదివితే ఎంతో మంచిది. చదివిన తర్వాత ఆంజనేయుణ్ని ఆరాధించడం మాత్రం మరిచిపోకూడదు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివుడిని ఆరాధించాలి. శనిదేవుడు శివుడిని గురువుగా భావిస్తాడు. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించడంతోపాటు మహా మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఏ పని తలపెట్టినా అవరోధాలు లేకుండా విజయవంతంగా పని పూర్తవుతుంది.












Click it and Unblock the Notifications