నేటి నుంచి రోహిణికార్తె: మే25 నుంచి జులై 7,2018వరకు..

మనందరికి రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణిలో రోకండ్లు పగిలే ఏండలు ఉంటాయి అనే నానుడి మనలో ఉంటుంది.మరి ఈ సారి పంచాంగ రిత్య రోహిణికార్తి ఏలా ఉంటుందో పరిశీలిద్దాం.

రోహిణి కార్తి తేది 25-మే-2018 నుండి 7-జూన్-2018 వరకు ఉంటుంది.పంచాంగ ప్రకారం ఈ రోహిణి కార్తి అనేది గుర్రం వాహణంగా,పాదజలం ఫలితంగా 1,2,3,4 తేదీలలో రుతుపవనములు కేరళ తాకును. ఎండలు తగ్గుముఖం పట్టును.అక్కడక్కడ తొలకరి వర్షములు వాయుబీభర్సవంలు కలుగే అవకాశములు ఉన్నవి.

Rohini Karthi Starts From Today

ఫలితంగా ఈ పక్షం ఎండ తీవ్రతలు,ఉక్కపోత ఉంటుంది. కొన్ని చోట్ల వర్షసూచనలు కూడా గోచరిస్తున్నాయి.ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది కావునా తగు శ్రద్ద తీసుకోవాలి.ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం,మజ్జిగా,నిమ్మరసం,ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన శరీర ఆరోగ్యంనకు అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది.

నీటి సౌఖర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి.శారీరక తాపం తగ్గుతుంది.చిన్నపిల్లలకు తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి.అన్ని రకాల వయస్సు వారు ఎక్కువ శాతం కాటన్ దుస్తులను,తేలిక రంగు కలిగినవి ధరిస్తే మంచిది.ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సాటి జీవులైన పశు,పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి.ఇతరులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి.ఈ సేవా కార్యక్రమం వలన మీ గ్రహభాదల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది జై శ్రీమన్నారాయణ.

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+