వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకముఖ రుద్రాక్షమాలధారణతో ఎన్నో ప్రయోజనాలు

ఏకముఖ రుద్రాక్షమాలధారణ దీనినే శివరుద్రాక్ష అంటారు. ప్రతి ఒక్కరూ దీనినే ధరించవలయును దీనిని శివుని ప్రతిరూపముగా చూస్తారు. ఈ రుద్రాక్ష అసలైనది. దొరకుట చాలా దుర్లభము.

|
Google Oneindia TeluguNews

హైదరాబద్: ఏకముఖ రుద్రాక్షమాలధారణ దీనినే శివరుద్రాక్ష అంటారు. ప్రతి ఒక్కరూ దీనినే ధరించవలయును దీనిని శివుని ప్రతిరూపముగా చూస్తారు. ఈ రుద్రాక్ష అసలైనది. దొరకుట చాలా దుర్లభము.

ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నము ఈ రుద్రాక్షను పరమశివ స్వరూపముగా భావిస్తారు ఈరుద్రాక్షను సూర్యుని స్వరూపముగా పూజిస్తారు. దీనిధారణ వలన సూర్యగ్రహ అనుగ్రహప్రాప్తి పాత్రులగుదురు.

ఈ మాలధారణ వలన ఆధ్యాత్మిక శక్తులు వశమగును. ఆధ్యాత్మిక జీవితములో హిమాలయ శిఖరమంత ఎత్తు ఎదుగును. అరుదుగా లభించే అద్భుతమైన ఈ ఏకముఖిరుద్రాక్ష జీడిపపు ఆకారములో (అర్ధచంద్రా కారమువలె ఉండును) మంత్ర-తంత్ర ప్రయోగములు త్రిప్పికొట్టబడును.

ఆధ్యాత్మికాభివృద్ధి కనబడును దీనిధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును. మనస్సులో భక్తి కలుగును. ఈ మూలను ధరించినవారు ఆర్థికముగా అందరికంటే ముందంజలో వుండుదురు. ఇది చాలా ఖరీదు.. దొరుకుట చాలా కష్టము ముఖ్యముగా రాజులు, పరిపాలకులు, నాయకులు ధరించి అత్యద్భుత ఫలితములు పొందుతున్నారు. దీని ధారణ వలన సిరిసంపదలు కలుగును.

Rudraksha uses

అంతేకాక, ధరించిన వారు ఉన్నతి నొందుదురు. అన్ని రుద్రాక్షల కంటే సర్వోత్తమమైనది ఈ మాలధారణ చేయునప్పుడు రుద్రాక్ష మంత్రమును 11 మార్లు జపము చేయవలెను దీని ధారణవలన బ్రహ్మహత్యాదోషము తొలగును. అంతేగాక ఇంద్రియ నిగ్రహము కలుగుతుంది.
ఈరుద్రాక్షధారణ టి.బి, మరియు ఆస్త్మాలాంటి మొండివ్యాధులను తగ్గిస్తుంది. అంతేగాక తలనొప్పి, కంటి సమస్య, లివర్ సమస్యలు తొలగును.

ద్విముఖి రుద్రాక్షమాలధారణ

రెండు ముఖాలు కల్గిన రుద్రాక్ష అర్థనారీశ్వరతత్వాన్ని బోధిస్తుంది. దీని ద్వారా అర్థనారీశ్వరులకు సంతోషము కల్గిస్తుంది. ముఖ్యముగా గురుపూర్ణిమ, పర్వదినమునందుగాని దత్తజయంతినాడుగానీ బ్రాహ్మీముహూర్త సమయములో ధరించవలెను.

సాధారణముగా గురువారముగాని, శుక్రవారముగాని కార్తీకమాసములోగాని ఉదయము 6గం| నుండి 7గం|ల లోపు ధరించగలరు. ముందుగా ఆవుపాలతో శుద్ధిచేసి శివాలయములో రుద్రాభిషేకం చేసి ధారణ చేయగలరు.

ఈ మాలధారణ చేయునపుడు రుద్రాక్ష మంత్రమును 11మార్లు జపించ వలెను ద్విముఖి మాలధారణ కలిగివుంటే కల్పవృక్షము చెంత వున్నట్టే భావించవలయును. మాలను నిద్రపోవు ముందర తలగడ క్రింద పెట్టి నిద్రపోయినచో నిద్రలేక బాధపడేవారికి హాయిగా నిద్ర పడుతుంది. దీనిని ధరించివారు ఆధ్యాత్మిక శక్తులు పొందుదురు.

ఈ మాలను ధరించేవారు సంఘములో లౌకిక జీవితములో ఇరుగుపొరుగు వారితో సహజసిద్ధముగా మెలగగలరు. మనస్సు నిలకడలేనివారు, పౌర్ణమి తిధియందు ఈ రుద్రాక్ష ధరించిన చాలా శ్రేష్టం. వ్యాపారం చేయువారికి చాలా మంచిది.

English summary
Astrologer described the importance of Rudraksha and explains about it's uses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X