సాదుసంత్ సమాధానాలు
డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు, ఫోన్: 9440611151
ప్రశ్న: ప్రపంచం లో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు
సాధువు: కాదు, మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.

ప్రశ్న: మనకు అత్యంత దూరం లో వున్నది ఏమిటి ?
జ: చాలామంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
సాదువు: మనకు అత్యంత దూరం లో వున్నది గడిచిపోయిన కాలం ,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి.ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలం లోకి వెళ్లలేము.
ప్రశ్న: ప్రపంచం లో పెద్దది ఏది?
జ:చాలామంది పర్వతం, సూర్యుడు, భూమి
సాధువు: ప్రపంచంలో పెద్దది మన పాపమే
ప్రశ్న :ప్రపంచం లో కఠినంగా,బరువుగా ఉండేది ఏది?
జ: చాలా మంది స్టీల్,ఐరన్,ఏనుగు అని చెప్పారు.
సాధువు: కఠినమైనది అనేది "మాట ఇవ్వడం"
మాట ఇవ్వడం తేలికే కానీ నిలబెట్టుకోవడమే చాలా కష్టం.
ప్రశ్న: ప్రపంచం లో తేలికైనది ఏది?
జ: దూది,గాలి,ఆకులు అని చెప్పారు
.
సాధువు: ప్రపంచం లో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం.
ప్రశ్న:మనకు దెగ్గరగా వున్నది ఏది?
జ:తల్లి తండ్రులు,స్నేహితులు, బంధువులు అని చెప్పారు.
సాధువు: మనకు దెగ్గరగా ఉండేది మన చావు.
అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది కచ్చితం.
ప్రశ్న:ప్రపంచంలో సులువైనది ఏది ?
జ: తినడం, పడుకోవడం,తాగడం,తిరగడం
.
సాధువు: ప్రపంచం లో సులువైనది అనేది మరొకరి మనస్సును విరగ్గొట్టడం,ఇంతకంటే సులువు ఏదీ లేదు.
Sadhu Sant answers to many questions.
summery
ప్రశ్న: ప్రపంచం లో ఏది పదునైనది?
జ: చాలా మంది కత్తి అని చెప్పారు
సాధువు: కాదు, మనిషి నాలుక, ఎందుకంటే ఈ నాలుక తో మనుషులు ఇతరుల మనస్సును,వాళ్ళ నమ్మకాలను విరగ్గొట్టేస్తారు.
ప్రశ్న: మనకు అత్యంత దూరం లో వున్నది ఏమిటి ?
జ: చాలామంది చంద్రుడు ,సూర్యుడు ,గ్రహాలూ
సాదువు: మనకు అత్యంత దూరం లో వున్నది గడిచిపోయిన కాలం ,ఎంత ప్రయత్నించినా ఆ కాలాన్ని తీసుకురాలేము,ఆ కాలంలోకి వెళ్లలేము. అందుకే వున్న ఈ సమయాన్నే మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి.ఎంత డబ్బు వున్నా కూడా మనం గడిచిన కాలం లోకి వెళ్లలేము.

Click it and Unblock the Notifications