మకర సంక్రాంతి రోజున ఈ పనులు అస్సలు చేయకండి; సూర్యుడి కోపాగ్నికి గురికాకండి!!

తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యుడు ఈరోజు తన కొడుకైన శని ఇంటికి వెళతాడు. మకర, కుంభ రాశులకు శని అధిపతి కాబట్టి సూర్యుడు శని ఇంటికి ప్రయాణం చేసిన సమయంలో మకర సంక్రాంతి ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర నిపుణుల సూచనల ప్రకారం మకర సంక్రాంతి పర్వదినాన కొన్ని పనులు చేయటం నిషేధించబడింది.

మకర సంక్రాంతి రోజు కొన్ని పనులు చేస్తే ప్రతికూల ప్రభావం

మకర సంక్రాంతి రోజు కొన్ని పనులు చేస్తే ప్రతికూల ప్రభావం

మకర సంక్రాంతి పర్వదినాన చెయ్యకూడని పనులు ఏమిటి? సూర్యుడు ప్రసన్నం కోసం ఆ రోజు ఏ పనులు చేయకుండా ఉంటే మంచిది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మకర సంక్రాంతి పర్వదినాన పొరపాటున కూడా మిగిలిపోయిన ఆహారాన్ని తీసుకోకూడదు. మకర సంక్రాంతి పర్వదినాన స్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. అంతేకాదు సాయంత్రం సమయాల్లో, రాత్రి వేళల్లో ఆహారం తీసుకోకూడదని చెప్పబడింది. మకర సంక్రాంతి పర్వదినాన ఎవరైనా మిగిలిపోయిన ఆహారాన్ని తింటే వారికి కోపం అధికమవుతుందని, వారిపై ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ అని చెబుతున్నారు.

మకర సంక్రాంతి నాడు అస్సలు చెయ్యకూడని పనులివే

మకర సంక్రాంతి నాడు అస్సలు చెయ్యకూడని పనులివే


మకర సంక్రాంతి పర్వదినాన ఎట్టి పరిస్థితులలోనూ మసాలాలతో తయారుచేసిన నాన్ వెజ్ ఆహారాన్ని తీసుకోకూడదు. మాంసం, మద్యం, వెల్లుల్లి , ఉల్లిపాయలను తమ ఆహారంలో తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు. సాత్వికాహారంతో చాలా మేలు జరుగుతుందని అంటున్నారు.

ప్రకృతి విషయంలో జాగ్రత్త

ప్రకృతి విషయంలో జాగ్రత్త


మకర సంక్రాంతి ధాన్య రాశులు ఇంటికి వచ్చే వేళ జరుపుకునే పండుగ కాబట్టి రైతులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడు ప్రకృతికి హాని తల పెట్టవద్దని చెబుతున్నారు. మకర సంక్రాంతి పండుగ రోజు ఎవరు ఎక్కడ చెట్లు నరకడం చేయరాదని సూచిస్తున్నారు. అలా చేస్తే ఆ పాపం మన వెంట వస్తుందని అంటున్నారు. ప్రకృతికి హాని కలిగిస్తే మన మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.

వారిని అవమానించొద్దు .. వీలైతే ఆ పని చెయ్యండి

వారిని అవమానించొద్దు .. వీలైతే ఆ పని చెయ్యండి


మకర సంక్రాంతి పర్వదినాన పేద వాళ్ళను, నిస్సహాయులను అవమానించ కూడదు అని, ఇలా చేయడం పాపం చేయడమేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మకర సంక్రాంతి పర్వదినాన చెడ్డమాటలు మాట్లాడకూడదని, ఇంటికి ఎవరైనా యాచకులు వస్తే రిక్త హస్తాలతో పంపించ కూడదని చెబుతున్నారు. మకర సంక్రాంతి దానధర్మాలకు పెట్టింది పేరు కాబట్టి, సాధ్యమైనంత వరకు ఎవరు వచ్చినా దానధర్మాలు చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు.

సూర్యుడికి ఆగ్రహం తెప్పించే పనులు చెయ్యకండి

సూర్యుడికి ఆగ్రహం తెప్పించే పనులు చెయ్యకండి


మకర సంక్రాంతి పర్వదినాన పశువుల నుండి పాలు పితికకూడదని, కనుమ రోజు మనం పశువులను పూజించుకుంటాం కాబట్టి ముందు రోజు పాలు పితకకూడదని, పాలను దూడలకు మాత్రమే వదిలేయాలని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడికి ఆగ్రహం తెప్పించే ఏ పనులు చేయకూడదు అని, శని మనల్ని పీడించే పనులకు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+