కుంభరాశిలో శని ప్రత్యక్షం: ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం!!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మన జీవితాలపైన శని ప్రభావం ఎంతో ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శని నవంబర్ 4వ తేదీ వరకు కుంభరాశిలోనే కొనసాగుతుంది. అయితే నవంబర్ 4వ తేదీన శనివారం నాడు శని అదే రాశిలో ప్రత్యక్షంగా తిరగాల్సి ఉంది. ఈ మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. దీపావళికి ముందు వృషభరాశి, కర్కాటకరాశి, కన్యారాశి జాతకులు కుంభరాశిలో శని ప్రత్యక్షంగా తిరగడంవల్ల లబ్ధిని పొందుతారు.
ఈ సంవత్సరం దీపావళికి ముందు శని ప్రత్యక్షంగా కుంభ రాశిలో సంచరించడంతో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుభప్రదంగా ఉంటుంది. వృషభరాశి జాతకుల ఆత్మవిశ్వాసం ఈ సమయంలో మరింత పెరుగుతుంది. వారు ఏ ప్రయత్నం చేసినా సత్ఫలితాలను అందుకుంటారు. వర్తక, వ్యాపారాలు చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఉపాధికి కూడా అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి.

కన్య రాశి జాతకులకు దీపావళికి ముందు బాగా కలిసి వస్తుంది. శని ప్రభావం వల్ల ఉద్యోగ, వ్యాపారాలలో ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి వ్యక్తిగత దృక్పథం మెరుగుపడుతుంది. కన్యారాశి జాతకుల కుటుంబంలో శాంతి వెల్లి విరుస్తుంది. ఆర్థికంగానూ లాభదాయకంగా ఉంటుంది. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఈ సమయం కొత్త పనులు చెయ్యటానికికన్యా రాశి జాతకులకు అనుకూలమైన సమయం.
శని ప్రత్యక్షం కారణంగా కర్కాటక రాశి జాతకులకు బాగా కలిసొస్తుంది. వారిని అదృష్ట లక్ష్మి వరిస్తుంది. విద్యా విషయంలోనూ , వృత్తిపరమైన విషయాలలోనూ తిరుగులేని విజయాలను సాధిస్తారు. కర్కాటక రాశి జాతకులు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి ఎక్కువ మద్దతును పొందుతారు. ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది సరైన సమయం. కర్కాటక రాశి జాతకులకు కుంభ రాశిలో శని ప్రత్యక్షం కావడం దీపావళికి ముందు లాభదాయకంగా ఉంటుంది.ఈ మూడు రాశులకు శని ప్రత్యక్షం కారణంగా తిరుగే ఉండదు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications