మార్చి 28న అద్భుతం... ఈ రాశులను కన్నెత్తి కూడా చూడలేరు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 28వ తేదీ అత్యంత కీలకమైన రోజు. ఆరోజు న్యాయదేవత అయిన శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభ రాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ సంచారాన్ని శనిదేవుడు వెండి పాదాలతో చేయబోతున్నాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకునే శనిదేవుడు ఈసారి కూడా అలాగే మార్చుకుంటున్నాడు. అయితే ప్రత్యేకంగా వెండిపాదాలతో సంచరించనున్నాడు. ఈ ప్రభావం వల్ల మూడు రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మంచి ఆరోగ్యం చేకూరుతోంది. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ సమయం ఈ రాశివారికి అద్భుతం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. భవిష్యత్తులో మంచి లాభాలను ఆర్జిస్తారు. కెరీర్ కు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ రాశివారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎదుటివారితో సంబంధాలు కలుపుకొని సమాజంలో మంచిపేరు తెచ్చుకుంటారు.

మకర రాశి
ఈ రాశివారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు భారీగా ఉంటాయి. వాటిని తిరిగి ఇతర వ్యాపారాల్లోకి పెట్టుబడుల రూపంలో మళ్లిస్తారు. ఊహించనిస్థాయిలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. అలాగే వేతనం కూడా పెరుగుతుంది. తండ్రి నుంచి, ఇతర కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.
కన్యారాశి
ఈ రాశివారికి ఎంతో మేలు కలగడంతోపాటు ఏలినాటి శని నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవితంలో సంతోషం రెట్టింపు అవడంతోపాటు ఆనందంగా జీవిస్తారు. కష్టపడి పనిచేసేవారికి అద్భుతమైన ఫలితాలున్నాయి. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. బాధలన్నీ తొలగిపోవడంతోపాటు అందరూ కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్థులకు ఈ సమయం చాలా బాగుంది. వ్యాపారాల్లో లాభాలున్నాయి. కొన్నాళ్లుగా ఉన్న భూ సంబంధిత వివాదాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది.












Click it and Unblock the Notifications