అద్భుతమైన వ్యాపార యోగం ఉంది.. నవగ్రహ శ్లోకాలు పఠించాలి
జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంది. దీన్ని రాశి పరివర్తనం అంటారు. తాజాగా ఈనెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాశిఫలాల ఫలితాలు ఎలా ఉన్నాయి? కుటుంబ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి? ఒకవేళ కష్టాలుంటే వాటిని నిపుణుల సలహాతో ఎలా అధిగమించాలి? తదితర విషయాలన్నింటిపై రాశులవారీగా వివరాలు తెలుసుకుందాం.
తులా రాశి
ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడంవల్ల మేలు కలుగుతుంది. అద్భుతమైన వ్యాపార యోగం కనపడుతోంది. దేనికీ తొందరపాటు పనికిరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. దగ్గర వరకు వచ్చి కొన్ని ఆపదలు ఇబ్బంది పెడతాయి. సూర్య దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి
ఇది మంచి సమయం. ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలుంటాయి. అధికార యోగం కనపడుతోంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని పట్టుదలగా అమలు చేయాలి. సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల వెతుకుతున్నది దొరుకుతుంది.
ధనుస్సు రాశి
ఇప్పుడు తీసుకునే నిర్ణయం విజయాన్ని కలిగిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. అదృష్టం తోడుంటుంది. ఆలోచనలకే పరిమితం కాకుండా కార్యాచరణ ప్రారంభించాలి. శత్రువులు మిత్రులుగా మారతారు. అభివృద్ధి ఉంటుంది. భూమితోపాటు వాహన యోగాలున్నాయి. మహాలక్ష్మిని స్మరించాలి.
మకర రాశి
అడుగడుగునా ఆటంకాలు ఎదురైనప్పటికీ ధర్మమార్గంలోనే ముందుకు వెళ్లాలి. అందుకు దగ్గరివారి సహకారం తీసుకోవాలి. వాస్తవాలకు దగ్గరగా, ఎంతో సృజనాత్మకంగా పనిచేయాలి. ఉద్యోగంలో నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. ఓర్పుతో వేచివుండాలి. వారాంతంలో ధైర్యాన్ని కలిగించే వార్త వింటారు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
కుంభ రాశి
ప్రశాంతంగా ఆలోచించి పనిచేయాలి. విఘ్నాలన్నీ తొలగిపోతాయి. పనులు త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో పొరపాట్లకు తావివ్వకుండా చేయాలి. చెడును అసలు ఊహించవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
మీనరాశి
అదృష్టం తోడుంటుంది. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి లభిస్తుంది. సుస్థిరమైన పదవీ యోగం కనపడుతోంది. స్వయం కృషితో ఉద్యోగంలో మంచి స్థానాన్ని అందుకుంటారు. ఆశయాలు నెరవేరతాయి. మంచి పనులు చేయడంవల్ల చక్కటి భవిష్యత్తు సొంతమవుతుంది. లక్ష్మీదేవిని దర్శించాలి.












Click it and Unblock the Notifications