కాలం వ్యతిరేకంగా ఉంది.. ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేయాలి
గ్రహాలు నిర్దిష్ట వ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలోనే కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారికి అశుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం ఏ రాశివారికి బాగుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో ఎటువంటి ఫలితాలు ఎదురు కానున్నాయి? సానుకూలంగానే ఉంటుందా? లేదంటే ప్రతికూలత ఎదురవుతుందా? అలా ఎదురైతే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అనే అంశాలను జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాశిచక్ర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తుల రాశి: ఉద్యోగంలో ఉన్నతస్థానం కనపడుతోంది. ఆశయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులన్నీ త్వరగా అవుతాయి. లాభాలు పొందుతారు. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మిత్రుల బలం పెరుగుతుంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.

వృశ్చికరాశి: శుభ ఫలితాలున్నాయి. కర్తవ్యాన్ని నిర్వహించాలి. విఘ్నాలను అధిగమించి మరీ లక్ష్యాన్ని చేరుకుంటారు. పెద్దల నుంచి మద్దతు దొరుకుతుంది. విశేష ధనయోగాలున్నాయి. అదృష్టవంతులవుతారు. ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. చంచలత్వం కూడదు. వారం చివరలో మంచి జరుగుతుంది. విష్ణు స్మరణ చేయాలి.
ధనుస్సు రాశి: ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. సమాయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుండాలి. గతంలో ఎదుర్కొన్న అనుభవాలు ఇప్పుడు ఉపయోగడపతాయి. మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటారు. మాట మృదువుగా ఉండాలి. ఇష్టదేవతను ధ్యానించడంవల్ల శక్తి వస్తుంది.
మకర రాశి: ధర్మమార్గంలో నిర్ణయాలు తీసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఉద్యోగం కూడా జాగ్రత్తగా ఉండాలి. మాటతీరు మృదువుగా ఉండాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
కుంభరాశి: పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. ధర్మమార్గంలో ముందుకు సాగాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. తొందర పనికిరాదు. ఆర్థిక నష్టాలు రాకుండా ఉండాలంటే ఒక ప్రణాళికతో పనిచేయాలి. ముఖ్యమైన పనులు కొన్నింటిని వాయిదా వేయాలి. కొత్తపనులు చేయవద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.
మీన రాశి: కాలం బాగుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో పేరు వస్తుంది. అధికార యోగం కనపడుతోంది. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారం కలిసివస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. మహాలక్ష్మిని ధ్యానించాలి. శుభవార్తలు వింటారు.












Click it and Unblock the Notifications