సెప్టెంబరు నెలలో ఈ రాశుల పంట పండింది

జ్యోతిష్యం ప్రకారం తిరోగమన దశలో ఉన్న బుధుడు వచ్చేనెల నాలుగోతేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత అదే నెల 23వ తేదీన కన్యారాశిలోకి సంచారం చేస్తాడు. అలాగే సంపదకు కారణమయ్యే శుక్రుడు సెప్టెంబరు 18వ తేదీ నుంచి తులారాశిలో ప్రయాణిస్తాడు. గ్రహాల రాజు సూర్యుడు కూడా అదే నెల 16వ తేదీన కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబరు నెలలో ఒకేసారి ఇన్ని పరిణామాలు చోటుచేసుకోవడంవల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. కన్యారాశిలో బుధుడు, సూర్యుడి సంయోగంవల్ల కూడా కొన్ని రాశులకు అదృష్టం వరించనుంది.

సింహ రాశి
వీరికి డబ్బు సంపాదనకు అనేక అవకాశాలు కలుగుతాయి. వ్యాపారంలో విస్తరణ ఉండటంతోపాటు లాభాలున్నాయి. న్యాయపరమైన విషయాల్లో విజయం అందుకుంటారు. అవసరమైనదాన్ని సెప్టెంబరు నెలలో పొందుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు.

september month lucky zodiac signs details here

మేష రాశి
ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంది. అన్ని సౌకర్యాలు సమకూరతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.

తులా రాశి
అన్నీ అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెట్టిన పెట్టుబడిపై మంచి ఆదాయం వస్తుంది. ఈనెలలోనే కొన్ని విజయాలను సాధిస్తారు.

కన్యా రాశి
డబ్బును కూడబెడతారు. ఈ సమయంలో సంపాదన కూడా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యక్తిగతంగా కూడా శుభవార్తలను అందుకుంటారు.

మీన రాశి
ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ఆర్థికంగా మంచి పనితీరుతో స్థిరపడతారు. ఈనెల రోజులు వీరికి చాలా బాగుంటుంది.

ధనుస్సు రాశి
వ్యాపారస్తులకు లాభాలున్నాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త వనరుల నుంచి కూడా డబ్బు అందుతుంది. ఉద్యోగంలో పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+