మూడు గ్రహాల సంయోగం.. జూన్ లో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
జ్యోతిష్యం ప్రకారం జూన్ నెల చాలా కీలకమైన నెల. ఈ నెలలో ముఖ్యమైన గ్రహాల సంయోగం ఉంది. దీనివల్ల ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల రాకుమారుడైన బుధుడు, గ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడు కలుస్తున్నాయి. దీనివల్ల ఏర్పడే యోగాన్ని త్రిగ్రాహి యోగంగా పిలుస్తారు. ఈ ప్రభావంతో ఏడు రాశులవారు తమ జీవితంలో ఇంతవరకు కళ్లచూడని సంపదను దక్కించుకోవడంతోపాటు అనేక రకాల ప్రయోజనాలను పొందనున్నారు.
మీన రాశి
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. గతంలోకంటే ఇప్పుడు తల్లిదండ్రులతో చాలా బాగుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. కొత్తగా వాహన యోగం ఉంది.

ధనుస్సు రాశి
దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అన్నీ సానుకూలంగా జరుగుతాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది.
మిథునరాశి
అపారమైన సంపదను పొందుతారు. పెద్దల నుంచి ఆస్తి కలిసివస్తుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.
కుంభ రాశి
ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. తల్లిదండ్రులకు పిల్లల వల్ల మంచి యోగం కలుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు.
తులా రాశి
తండ్రి వైపు నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసం కలిగి పనులన్నీ మంచి సామర్థ్యంతో పూర్తిచేస్తారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి కొత్తగా పదవీ బాధ్యతలు దక్కుతాయి. ఆధ్యాత్మిక వాతావరణంపట్ల ఆసక్తులై తీర్థక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యలో చేరతారు.
కన్యా రాశి
కోరుకున్న చోట ఉద్యోగం చేయాలనుకుంటున్న ఉద్యోగుల కోరిక నెరవేరుతుంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. తాము చేసే పనిలో మంచి సామర్థ్యాన్ని గడించి మంచి పేరు తెచ్చుకుంటారు.
కర్కాటక రాశి
పూర్వీకుల నుంచి ఆస్తి కలిసివస్తుంది. కారు కొనాలనే కోరిక తీరుతుంది. కొత్త ఉద్యోగాన్ని సంపాదిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications