అక్టోబర్ లో వీరి దశ మార్చనున్న శని.. మీరున్నారేమో చూసుకోండి!

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తున్నాడు. శనిని కర్మదేవుడిగా, న్యాయ మూర్తిగా, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్తారు. అటువంటి శని దేవుడు 2026 అక్టోబర్ 9 శుక్రవారం సాయంత్రం 7:28 గంటలకు తన స్వంత నక్షత్రమైన ఉత్తరాభాద్రపదలోకి ప్రవేశించనున్నాడు.

ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారి జీవితంలో ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలదు.శని డిసెంబర్ 11 వరకు వక్రగతిలోనే ఉండి, ఆ తర్వాత నేరుగా చలిస్తాడు. ఉత్తరాభాద్రపద శనికి స్వంత నక్షత్రం కావడంతో దీని ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది.

కన్యారాశి, వృశ్చిక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
కన్యారాశి, వృశ్చిక రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
Shani gochar saturn Enters Uttara Bhadrapada Nakshatra on 9 October 2026 Blessings for these Zodiac Signs

కుంభ రాశి:

కుంభరాశిలో శని ఏల్నాటి శని చివరి దశలో ఉన్న వారికి అనూహ్య ఆర్థిక లాభాలు కలుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. ఈ క్రమంలో పెట్టుబడులు ఫలించడం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుస్తుంది.

మేష రాశి:

మేషరాశి జాతకులకు వృత్తిలో నెమ్మదిగా కానీ స్థిరమైన పురోగతి కలుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఒప్పందాలు కొనసాగుతాయి.మేషరాశి జాతకులకు కుటుంబ మద్దతు లభిస్తుంది.

మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం
మేష రాశి, మిథున రాశి 2026 అక్టోబరు నెల సమగ్ర జాతక ఫలం

మిథున రాశి:

మిథున రాశి జాతకులకు శని నక్షత్ర సంచారం కారణంగా ఉద్యోగం చేసే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో కొత్త బాధ్యతలు, గుర్తింపు వస్తాయి. ఆదాయ స్థిరత్వం వస్తుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.

సింహ రాశి:

సింహ రాశి జాతకులకు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ స్వనక్షత్రంలో ఉండటం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గి రాజయోగం కలుగుతుంది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక లాభాలు, ప్రమోషన్ లు వస్తాయి. భూమి లేదా వాహన కొనుగోలు అవకాశాలు సింహరాశి వారికి ఉంటాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి శని కటాక్షం కారణంగా అదృష్టం అనుకూలంగా ఉండి సంపద, వైభవం పెరుగుతాయి. శని ఈ సంచారం ద్వారా కలిసొచ్చి కన్న కలలు నెరవేరే అవకాశం ఉంటుంది. ఈ సమయం వీరికి అన్ని విధాలా ఆర్ధిక ప్రయోజనాలను కలిగిస్తుంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+