లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చిన్న చిట్కా
ఒక్క గులాబీ పువ్వు మీ రాతను మారుస్తుంది.. ఇలా చేయడంవల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తెలుసా మీకు. గులాబీ పువ్వుంటే చాలు.. మీ కష్టాలన్నీ తీరిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది గులాబీ పువ్వు. అమ్మాయిలు ఎక్కువగా గులాబీ పూలను ఇష్టపడతారు. చాలామంది ఇంట్లో కుండీలద్వారా వీటిని పెంచుతారు. అపార్ట్ మెంట్లలో సైతం గులాబీ మొక్కను పెంచడాన్ని ఇష్టపడతారు.
ఇంటిని అలంకరించడం నుంచి ముఖానికి పూసుకునే వరకు అనేక రూపాల్లో గులాబీపూలను ఉపయోగిస్తారు. చర్మ సంరక్షణ కోసం రోజ్ వాటర్, రోజ్ ఆయిల్ ను చాలామంది మహిళలు ఉపయోగిస్తారు. చర్మంపై గులాబీలా గ్లో రావడానికి గులాబీ పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే, ప్రేమకు చిహ్నమైన గులాబీకి వాస్తు శాస్త్రంలో చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. గులాబీ పువ్వుని ఇలా ఉపయోగిస్తే కష్టాలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.

* వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే లేదా తరచుగా డబ్బు అవసరపడుతుంటే శుక్రవారం రోజు గులాబీ పువ్వుపై రాగి ముక్కను కాల్చి లక్ష్మీదేవికి సమర్పించాలి. శుక్రవారం సాయంత్రం ఈ పరిహారం చేయడం ఉత్తమమైనదిగా చెబుతున్నారు. ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులవుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది.
* వాస్తు శాస్త్రం ప్రకారం మీ ప్రతి కోరిక నెరవేరాలని మీరు కోరుకుంటే మంగళవారంకానీ, శనివారం కానీ హనుమంతుడికి 11 తాజా గులాబీపువ్వులను సమర్పించండి. ఈ పరిహారాన్ని 11 మంగళవారాలు నిరంతం చేయాలి. లేదంటే 11 శనివారాలు చేయాలి. దీనివల్ల మీ కోరికలు నెరవేరడమే కాకుండా మీకు అంతులేని విశ్వాసం వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
* వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో ఆనందం విలసిల్లడానికి లక్ష్మీ దేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పువ్వును సమర్పించండి. ఇంటికి సంతోషం రావడమేకాదు.. మీ ఇంటికి పట్టిన చెడు దృష్టి కూడా తొలిగిపోతుంది.
* మీ ఇంట్లో ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే.. తమలపాకులో గులాబి పువ్వు వేసి 11 సార్లు వ్యాధిగ్రస్తులకు దిష్టి వేసి నదిలో పారేయాలి. దీనివల్ల త్వరలోనే ఉపశమనం కలుగుతుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.
* మీరు మీ ఉద్యోగంలో బాధపడుతుంటే లేదా మీరు మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే క్రమం తప్పకుండా 40 రోజుల పాటు చెప్పులు లేని పాదాలతో హనుమంతుడి ఆలయానికి వెళ్లాలి. వెళ్లి మారుతికి ఎర్ర గులాబీ పువ్వును సమర్పించాలి. శనివారం రోజు ఈ పరిహారం ప్రారంభించడం ఉత్తమమైనదిగా చెబుతారు.












Click it and Unblock the Notifications