ఫిబ్రవరిలో 2 మహా యోగాలు... ఈ రాశులకు అఖండ ధనయోగం
వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు యోగాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి, చంద్రుడు వృషభరాశిలో కలవడంతో గజకేసరి, సూర్యుడు, బుధుడు మకర రాశిలో కలుస్తుండటంతో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నాయి. గజకేసరి యోగం మూడు రోజులు ఉంటుంది. బుధాదిత్య యోగం ఈనెల 27 వరకు ఉంటుంది. దీనివల్ల ఆరు రాశులవారిపై కనక వర్షం కురవబోతోంది. ఏ పని తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఏయే రాశులకు ఈ రెండు మహా యోగాలవల్ల కలిసివస్తున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
కన్య
నిరుద్యోగులకు ఏకంగా విదేశాల్లో అవకాశాలు తలుపుతడతాయి. లాటరీలు, షేర్లు, స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. తండ్రివైపు నుంచి ఆస్తి వస్తుంది. కోర్టుల్లో ఉన్న కేసులన్నీ పరిష్కారమవుతాయి. సొంత ఇంటిని కొనుగోలు చేస్తారు లేదంటే నిర్మించుకుంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

వృశ్చికం
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడి అవి లాభానికి దారితీస్తాయి. పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ఉన్నతస్థాయి పదవులను అలంకరిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
మకరం
ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరగడంతోపాటు హోదా కూడా కలుగుతుంది. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్లు, ఆర్థిక రంగాలకు సంబంధించినవాటిల్లో కనక వర్షం కురుస్తుంది. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
మేషం
వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో వేతనం పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గజకేసరి యోగంవల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు డిమాండ్ పెరుగుతుంది.
వృషభం
తండ్రి వైపు నుంచి ఆస్తులు వస్తాయి. వాటితోపాటు సంపద కూడా వస్తుంది. ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. ఈ రాశివారు అనేక విజయాలను అందుకుంటారు. బుధాదిత్య రాజయోగం వీరికి వరం లాంటిదని చెప్పొచ్చు.
కర్కాటకం
ప్రేమలో ఉన్నవారు పెళ్లి చేసుకుంటారు. వ్యాపారాలుకానీ, వృత్తికానీ బాగా వృద్ధి చెంది సంపదను తెస్తాయి. విదేశాల్లో సంపాదనకు అవకాశం ఉంది. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగంలో రాజయోగం ఉంది.












Click it and Unblock the Notifications