మహా పురుష యోగంతో మే 31లోగా ఈ రాశులవారు కోటీశ్వరులవుతారు
జ్యోతిష్యం ప్రకారం శుక్ర గ్రహం సంపదకు, ఐశ్వర్యానికి, అందానికి, విలాసవంతమైన జీవితానికి కారకుడు. జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ప్రస్తుతం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 1, 4, 7, 10 స్థానాల్లో ఉచ్ఛ స్థితిలో ఉంటే మాలవ్య మహా పురుష యోగాన్ని ఏర్పరుస్తాడు. దీనివల్ల ఆరు రాశులవారు లాభపడుతున్నారు. ఈ యోగం ప్రభావం మే 31వ తేదీ వరకు ఉంటుంది. ఏయే రాశులకు శుక్రుడివల్ల మహాభాగ్యం పట్టుకుంటోందనే విషయాన్ని తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోయి అందరి మధ్య అనుబంధం బలపడుతుంది. సొంత ఇంటికోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు వీరికి అనుకూలంగా పరిష్కారమవుతాయి.

కుంభ రాశి
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. షేర్లు లాంటి సంబంధిత వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాలనిస్తాయి. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అనుకోకుండా ధనాన్ని పొందుతారు. ఇంట్లో, బయట మీ మాటకు విలువ చాలా ఎక్కువగా ఉంది.
మీన రాశి
అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారం బాగా కలిసివస్తుంది. ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఉన్నత స్థానంలో ఉన్నవారితో పరిచయాలు కలుగుతాయి. ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది. జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా సాఫీగా సాగుతుంది.
వృషభ రాశి
వీరికి లాభస్థానంలో శని ఉండటంతో మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యాపారాల్లో, వృత్తుల్లో అనుకోని లాభాలు వస్తాయి. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అన్నివిధాలుగా ధనలాభం ఉంది.
మిథున రాశి
సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. సమాజంలోని ఒక ప్రముఖమైన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు.
కన్యా రాశి
ప్రేమ జీవితం బాగుంటుంది. పెద్ద కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. విదేశాలకు వెళతారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు చురుగ్గా సాగుతాయి. అందరూ సంతోషంగా జీవిస్తారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది.












Click it and Unblock the Notifications