17వ తేదీ నుంచి 3 రోజుల్లో కోటీశ్వరులయ్యే రాశులు వీరే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. చంద్రుడు, బుధుడు, బృహస్పతి సంచారం వల్ల ఈ నెల 17, 18, 19 తేదీల్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మీనరాశి
స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు బాగుంటాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. భూమి లాభంతోపాటు ఆస్తి లాభం కూడా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు.

మిథున రాశి
ఉద్యోగస్థులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉాద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వీరికి ప్రజల్లో మంచి పేరు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి.
మకర రాశి
వీరికి ధన యోగాలు, రాజపూజ్యాలు ఉన్నాయి. మూడు రోజుల్లోనే ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. కెరీర్ బాగుంటుంది.
తులా రాశి
వ్యాపారంలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్థులకు కెరీర్ బాగుంటుంది. తండ్రి వైపు నుంచి, లేదంటే భార్య వైపు నుంచి ఆస్తి రావడానికి అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మారుతుంది. నిరుద్యోగులు విదేశాలకు వెళతారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది.
కన్యా రాశి
నిరుద్యోగులకు కొంచెం కష్టపడితే విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ మూడురోజులు ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగస్థులకు వారి కార్యాలయంలో పై అధికారుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది.
వృషభ రాశి
వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రాశివారికి దేశ, విదేశాల్లో కూడా గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో గొప్పగా రాణిస్తారు. ఉద్యోగంలో, వృత్తిలో అంచనాలకు మించి పనిచేసి రాణిస్తారు.












Click it and Unblock the Notifications