ఆరు గ్రహాల కూటమి... రెండు రోజుల్లో కోటీశ్వరులవుతున్నారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో ఈ నెల 29, 30 తేదీల్లో ఆరు గ్రహాలు మీనరాశిలో యుతి చెందబోతున్నాయి. దీన్ని షష్ట గ్రహ కూటమి అంటారు. ఇది రెండురోజులే ఉంటున్నప్పటికీ దీని ప్రభావం మాత్రం మే నెలాఖరు వరకు ఉంటుంది. ఏయే గ్రహాలు యుతి చెందుతున్నాయంటే రాహువు, చంద్రుడు, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, శనిదేవుడు. దీనివల్ల మీనరాశి బలోపేతమవుతుంది. ఈ రాశి అనుకూలంగా ఉన్నవారంతా జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఏయే రాశులకు యుతి వల్ల బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.
కన్యా రాశి
ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా విదేశాలకు వెళతారు. స్టాక్ మార్కెట్ సంబంధిత రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలను అందుకుంటారు. దాంపత్య జీవితంలో, కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం జరుగుతుంది.

ధనుస్సు
కొత్త వాహనం, కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆస్తులు కలిసివస్తాయి. చిన్నపాటి శ్రమతోనే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు. ఎక్కువగా శుభవార్తలను వింటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
మకరం
ఆకస్మిక ధనలాభం ఉంది. వీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. అన్నివిధాలుగా కలిసివస్తుంది. అన్నదమ్ములతో ఉన్న ఆస్తి గొడవలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు కలిసివస్తాయి. ప్రయాణాలు లాభసాటిగా చేస్తారు. వ్యాపారంలో మీ ప్రత్యర్థులపై మీదే పైచేయిగా ఉంటుంది.
వృషభ రాశి
ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వృత్తిలో ఉన్నవారు, ఉద్యోగస్థులు విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. కుటుంబ సమస్యలతోపాటు వ్యక్తిగత సమస్యలు కూడా తొలగిపోతాయి.
మిథున రాశి
నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు వస్తాయి. సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు. ఈ రాశివారి ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. ఉన్నత పదవులను అధిరోహిస్తాయి. ఉద్యోగస్థులు తమకు నచ్చిన మంచి ఉద్యోగంలోకి మారతారు.
కర్కాటక రాశి
ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి వస్తుంది. విదేశాలకు పయనం అవడానికి మార్గం దొరుకుతుంది. కుటుంబంలో అన్నీ శుభ పరిణామాలే కలుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలన్నీ కలిసివస్తాయి. అదృష్టం కలిసిరావడంతో భారీగా డబ్బును ఆర్జిస్తారు.












Click it and Unblock the Notifications