మరో 4 రోజుల్లో ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతోంది!

గ్రహాల్లో దేవతల గురువైన బృహస్పతి అత్యంత శుభమైన గ్రహం. పాప గ్రహాలను కూడా శుభ గ్రహాలుగా మార్చి తనను నమ్ముకున్నవారికి ఎటువంటి అవరోధాలు రాకుండా కాపాడుతుంది. జాతకంలో గురువు శుభస్థానంలో ఆ జీవితానికి తిరుగుండదు. ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. ఈనెల 25, 26,27 తేదీల్లో సూర్యుడు, చంద్రుడి కలయిక మిథునరాశిలో ఉంది. గురువు యుతి వల్ల ఆరోజు ఉన్న అమావాస్య కూడా పౌర్ణమి రోజు ఇచ్చేటటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఏయే రాశులకు శుభం జరుగుతుందనే విషయాన్ని కూలంకషంగా తెలుసుకుందాం.

తులా రాశి
ఆరోగ్యం బాగుంటుంది. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. త్వరలోనే విదేశీ సంపాదనను అనుభవిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఆస్తి సమస్యలు తీరిపోతాయి. అవమానాలు లేకుండా రాజపూజ్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.

six zodiac signs will get amazing benefits and will go to abroad due to Jupiter enter gemini

ధనుస్సు రాశి
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. వ్యాపారం, వృత్తి.. రెండూ బిజీగా మారిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం తథ్యం.

కుంభ రాశి
షేర్ మార్కెట్ కు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభాన్నిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విదేశాలకు వెళతారు. ఈ రాశివారు వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా విదేశీ గడ్డపై అడుగుపెడతారు. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు. ఉద్యోగాలు చేసేవారికి మంచి గుర్తింపు కలుగుతుంది.

వృషభ రాశి
రావాల్సిన డబ్బును రాబట్టుకొంటారు. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి కలిసివస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నం పూర్తిగా విజయవంతమవుతుంది. ఆదాయం పెంచుకోవడానికి, డబ్బును భారీగా సంపాదించడానికి ఈ రాశులవారికి ఇదే మంచి సమయం.

మిథున రాశి
ఆస్తి వివాదాలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. పెట్టుబడుల విలువ పెరుగుతుంది. రాజయోగాలు పడతాయి. షేర్ మార్కెట్ కు సంబంధించిన వాటిల్లో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఉన్న ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం, వృత్తి అభివృద్ధి చెందుతాయి.

సింహ రాశి
విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పై స్థాయిలో పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యకు వెళతారు. విదేశీ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపారాల్లో మంచి లాభాలుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+