దిగ్బల యోగంతో మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల దశ, దిశ మారుతోంది

నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ప్రతి నెలకు తన రాశిని మారుస్తుంటాడు. ఈనెల 16వ తేదీన రవి భాగవానుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. వచ్చే నెల 16వ తేదీ వరకు అక్కడే కొనసాగుతాడు. సూర్యడు మకర రాశిలోకి ప్రవేశించడంవల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుంది. దీనివల్ల అన్ని రాశులపై మంచి ప్రభావం పడుతుంది. అయితే ప్రత్యేకంగా మీనం, ధనుస్సు, తుల, కర్కాటకం, వృషభం, మేష రాశులవారికి మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. సూర్యుడివల్ల వారికి ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.

తుల
తండ్రి వైపు నుంచి సంపద వస్తుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు.

six zodiac signs will get amezing benefits and huge money due to sun enter in capricorn from january 16th

ధనుస్సు
ఆస్తికి సంబంధించిన న్యాయవివాదాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. భత్యాలు కూడా అందుతాయి. నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ల అవకాశం లభిస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహం కుదురుతుంది.

మీనం
జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే ఎన్ని దోషాలున్నా తొలగిపోతాయి. వీరికి అలాగే జరుగుతోంది. ఆదాయం బాగా పెరుగుతుంది. తండ్రివైపు నుంచి ఆస్తులు వస్తాయి. అలాగే ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. ప్రభుత్వం వల్ల ధనలాభం ఉంది.

మేషం
ఈ రాశి 10వ స్థానంలో సూర్యుడు సంచారం చేయనుండటంవల్ల దిగ్బల యోగం పడుతోంది. ఇది అధికార యోగానికి దారితీస్తుంది. నిరుద్యోగులకు సొంత ప్రాంతాల్లోనే ఉద్యోగాలు దొరుకుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఆస్తికి సంబంధించి, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో తండ్రి నుంచి సహకారం అందుతుంది.

వృషభం
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే వీరికి విదేశాల నుంచి కూడా అవకాశాలు వస్తాయి. ప్రమోషన్ ఉంది. దీంతోపాటు ధనలాభం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపును పొందుతారు.

కర్కాటకం
చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఆదాయం భారీగా పెరుగుతుంది. చేతికి రాకుండా ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. శుభవార్తలను అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తి వారసత్వంగా లభిస్తుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+