అమావాస్యకు అరుదైన యోగం... ఈ రాశులకు అద్భుత ధనయోగం

అమావాస్య రోజు దీపావళి వస్తుంది. ఈనెల 31, నవంబరు 1, 2 తేదీల్లో తులారాశిలో అమావాస్య సంభవిస్తుంది. దీనివల్ల అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. వాస్తవానికి అమావాస్య ఎలా ఏర్పడుతుందంటే సూర్యుడు, చంద్రుడి కలయికవల్ల ఏర్పడుతుంది. చంద్రుడికి, శుక్రుడికి ఎంతో ఇష్టమైన రాశి తులారాశి. అమావాస్య రోజు వచ్చే అరుదైన యోగాలవల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా లాభపడుతున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా శుభ ఫలితాలు కలుగుతున్నాయి? ఏవిధంగా వారు ప్రయోజకులవుతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ధనుస్సు
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. బాగా ఉన్నవారి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. వ్యాపారంలో ఊహించనిరీతిలో లాభాలు వస్తాయి.

six zodiac signs will get more benefits due to Conjunction of Sun and Moon in Libra

మకరం
ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు జీతం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగ జీవితం సంతోషంగా గడుస్తుంది. అన్నివైపుల నుంచి ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

మేషం
వీరికి రాజయోగం కలుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రాజకీయాలకు చెందినవారితో పరిచయాలు కలుగుతాయి. పెండింగ్ పనులు ప్రారంభమవుతాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మిథునం
ఆదాయానికి సంబంధించి ఏ పని అనుకున్నా విజయం సాధిస్తారు. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు. మీ ప్రతిభకు, సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. రాబడి పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు.

కర్కాటకం
మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. సొంత ఇంటికోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ మూడురోజులు వీరికి కీలకమైన సమయం. ఏ పని అనుకున్నా అవుతుంది. ఒకరకంగా ఈ మూడురోజులు వైభవం అని చెప్పొచ్చు.

తుల
వీరికి కూడా రాజయోగం పడుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల ఉండి సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు చురుగ్గా సాగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం, వృత్తి రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+