ఏప్రిల్ లో ఏర్పడే సూర్యగ్రహణం భారత దేశానికి వర్తించదు ఎందుకు..?
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఒకే సరళరేఖపైకి నాలుగు గ్రహాలు 30న ఆకాశంలో అద్భుతం . ఏప్రిల్ 30 తేదీ రోజు ఆకాశంలో అద్భుతం కనిపించనున్నది. శుక్రుడు, అంగారకుడు, గురు, శని.. ఈ నాలుగు గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రానున్నాయి. శనివారం సూర్యోదయానికి గంట ముందు ఆకాశంలో తూర్పు వైపు దర్శనం ఇవ్వనున్నది . ఇది చూడడానికి ఎలాంటి బైనాక్యులర్స్, టెలి స్కోపు అవసరం ఉండదు. ప్రతీ వెయ్యేండ్ల కొకసారే ఈ ఖగోళ వింత ఆవిష్కృతమౌతుంది. ఈ గ్రహాలు ఒకే సరళరేఖ పైకి రావడాన్ని 'ప్లానెట్ పరేడ్' అంటారు
చైత్ర అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏప్రిల్ 30న శనివారం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం మన భారతదేశానికి వర్తించదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చి ఆ నీడ సూర్యునిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణాలు అమావాస్య రోజునే సంభవిస్తాయి. కానీ ప్రతీ అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి రెండు వారాల గడువులోనే ఏర్పడటం గమనార్హం.

ఏప్రిల్ 30న తేదీ రోజున సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకే మే 16న చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సూర్య గ్రహణం మన భారతదేశానికి వర్తించదు. ఎలాంటి గ్రహణ నియమాలు లేవు, వర్తించవు. గర్భిణీ స్త్రీలకు ఎలాంటి నియమ నిబందనలు లేవు. యధావిధిగా రోజు ఎలా ఉంటారో ఈ రోజు కూడా అలానే ఉంటే సరిపోతుంది. వీలైతే దైవ నామ స్మరణతో గడపండి.
ఈ సంవత్సరం మన భారతదేశంలో కనపడే సూర్యగ్రహణం అక్టోబరు 25న ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు వారాలకే నవంబరు 8న చంద్రగ్రహణం సంభవిస్తుంది.












Click it and Unblock the Notifications