సూర్యగ్రహణంవల్ల ఈ రాశులవారికి అన్నీ ఇక్కట్లే
Solar Eclipse 2023: పంచాంగంలో కొన్ని గ్రహాల యుతిని అత్యంత శుభసూచకంగా భావిస్తారు. ఏప్రిల్ 20న తొలి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఇది మేష రాశిలోని అశ్వనీ నక్షత్రంలోకి ప్రవేశించనుంది. మంగళ గ్రహం మిథున రాశిలో, బుధుడు మేష రాశిలో ఉండటం వల్ల అశుభంగా భావిస్తారు. గ్రహణం సమయానికి సూర్యుడు మేషరాశిలో రాహువు, బుధుడితో కలిసి ఉంటాడు. మంగళ, బుధ గ్రహాలు వేర్వేరు రాశుల్లో ఉండటం వల్ల పరివర్తన యోగం ఏర్పడుతోంది. అదేరోజు గ్రహాల ప్రత్యేక సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల ఏయే రాశులవారికి శుభప్రదమో పరిశీలిద్దాం.
తుల రాశి
పనిచేసే చోట మార్పులుంటాయి. వ్యాపార భాగస్వామితో విభేదాలు రావడానికి అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. పూర్వీకుల సంపద విషయంలో ఊహించని లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి. ఆరోగ్యపరంగా ఈ గోచారం మంచిది కాదు.
వృషభ రాశి
ఈ రాశివారు ఊహించినట్టు జరిగే పరిస్థితి ఉండదు. చేసే పనిని ఎంతో ఆత్మ విశ్వాసంతో చేయాలి. భవిష్యత్ గురించి ఆందోళన పడకూడదు. ఈ విషయంలో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. పెట్టుబడులకు దూరం ఉండటంతోపాటు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులుంటాయి.

మకర రాశి
వీరి కంటి వెలుగు దెబ్బతినే ప్రమాదముంది. అనారోగ్య పరిస్థితులుంటాయి. కర్తవ్యం నిర్వహించేచోట అలసట, బద్ధకం ఏర్పడుతుంది. ఒక్క యోగాద్వారానే వీటిని దూరం చేసుకోవచ్చు.
మేష రాశి
ఈ రాశివారు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. గోచారం అశుభం కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం దెబ్బతిని చట్టపరమైన కేసులో ఇరుక్కుంటారు. వ్యాపారులకు నష్టం. పెట్టుబడుల ఆలోచన విరమించుకోవాలి. బంధాలు దెబ్బతినడంతోపాటు అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కన్యా రాశి
మానసిక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో పరిస్థితులు బాగుండవు. ఇంట్లో సుఖ శాంతులు ఉండేలా ప్రయత్నాలు చేయాలి. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతోపాటు అనారోగ్యం కలుగుతుంది. ఎంతో అప్రమత్తంగా ఉండాలి.












Click it and Unblock the Notifications