29న సూర్య గ్రహణంతో ఈ రాశులకు ఏం జరుగుతుందో తెలుసా?
శనిదేవుడు న్యాయ దేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఈనెల 29వ తేదీన ప్రవేశించబోతున్నాడు. అదే సమయానికి మీనరాశిలో అనేక గ్రహాలు సంచారం చేస్తుంటాయి.
ఆరోజు చైత్రమాస అమావాస్య కావడంతోపాటు ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం కూడా అదే రోజు ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం చెల్లదు. ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మీనరాశిలో ఎక్కువ గ్రహాలు సంచారం చేయడంవల్ల గ్రహణ ప్రభావం కూడా పెరుగుతుంది.

వృషభరాశి
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం పలు జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
మేషరాశి
కొన్ని విషయాల్లో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే మానుకోవాలి. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్త లేకపోతే కొన్నింటిని కోల్పోవాల్సి ఉంటుంది.
మిథునరాశి
వ్యాపారం లేదంటే వృత్తి పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. అనేక ప్రయోజనాలను ఈ సమయంలో అందుకుంటారు.
కర్కాటక రాశి
పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే మానుకోవాల్సి ఉంటుంది. కారులో ప్రయాణం చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రయాణం మానుకోవాలి. కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సింహ రాశి
ఈ సమయం వీరికి ఎంతో గడ్డుకాలమని చెప్పొచ్చు. దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి.
మకర రాశి
ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. వృత్తితోపాటు ఉద్యోగంలో కూడా పురోగతి ఉంది. అనుకున్న ప్రయోజనాలను పొందుతారు. సాడే సతి శని ప్రభావం తొలగిపోతుంది. మంచి లాభాలను అందుకుంటారు.
మీనరాశి
శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. డబ్బులకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురవ్వాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications