శ్రవణం నక్షత్రంలో జన్మిస్తే: కళాకారులు కావచ్చు
శ్రవణ జాతకులకు అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. శాస్త్ర విజ్ఞానం, విద్య వివేకం, ఔదార్యం, మాటనేర్పు, స్త్రీ వ్యామోహం, ఉపకారం బుద్ధి, కీర్తి ప్రతిష్ఠలు, ఆర్జన, పుష్పసుగంధాలపై మోసు వుంటాయి.
హైదరాబాద్: శ్రవణ జాతకులకు అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. శాస్త్ర విజ్ఞానం, విద్య వివేకం, ఔదార్యం, మాటనేర్పు, స్త్రీ వ్యామోహం, ఉపకారం బుద్ధి, కీర్తి ప్రతిష్ఠలు, ఆర్జన, పుష్పసుగంధాలపై మోసు వుంటాయి. బంధువులకు ఉపకారం చేస్తారు. పరదేశ సంచారం వుంటుంది.
మొదటి పాదంలో పుట్టినవారు: కుజుడు మంగళాంశ కలహప్రియులు, తక్కువ పుత్రులు కలవారు అవుతారు.
రెండవ పాదంలో పుట్టినవారు: శక్రుడు భోక్తాంశ కాముకులు, ఎక్కువ సేవకులు కలవారు, తంత్రం తెలిసినవారు అవుతారు.

మూడవ పాదంలో పుట్టినవారు: బుధుడు విచక్షణాంశ చిత్రలేఖనం, పనుల్లో నేర్పరితనం, చిత్ర వస్త్రధారణలో ఆసక్తి కలవారవుతారు.
నాలుగవ పాదంలో పుట్టినవారు: చంద్రుడు ధనాంశ పొడవైన ముక్కు కలవారు, యోగం తెలిసినవారు, ధర్మం చేయువారు, పశువిక్రయంలో నేర్పరితనం, శుచీశుభ్రతలు కలవారవుతారు.












Click it and Unblock the Notifications