శ్రీకృష్ణాష్టమి రోజు ఇలా చేయండి: జ్యోతిష్యులు

శ్రీ కృష్ణ జన్మాష్టమి గొప్ప పర్వదినం. ఈ ఏడాది సెప్టెంబర్ 6న జరుపుకుంటారు. ఈ రోజున జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణుడిని అలంకరించి పూజిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి స్వామికి పంచామృతాన్ని నివేదిస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు తెలిసి లేదా తెలియక పెద్ద తప్పులు చేస్తుంటారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని నియమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

శ్రీ కృష్ణుని వీపు: దేవాలయంలో శ్రీకృష్ణుడిని వెనకవైపు నుంచి దర్శించకూడదని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. అలా చూస్తే పుణ్యాలు తగ్గిపోతాయి. కన్నయ్యకు వెనకవైపు అధర్మం నివసిస్తుందని, అధర్మాన్ని పెంచుతుందని చెబుతున్నారు. అంతుచిక్కని రాక్షసుడు కాలయవనుని ధర్మాన్ని అంతం చేయడానికి కూడా శ్రీ కృష్ణుడు అతనికి వెన్ను చూపవలసి వచ్చింది.

sri krishnastami 2023 Uniqueness

తులసి ఆకులు: జన్మాష్టమి రోజు తులసి ఆకులను తెంపకూడదు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజు శాలిగ్రామం ,తులసి వివాహం కూడా జరుగుతుంది.

అన్నం మానుకోవడం: జన్మాష్టమి రోజు భోజనం చేయకూడదు. ఏకాదశి రోజు కూడా అన్నం లేదంటే బార్లీతో చేసిన వాటిని తినకూడదు.

వెల్లుల్లి, ఉల్లిపాయ: వెల్లుల్లి, ఉల్లిపాయ ఉండే ఆహారం జన్మాష్టమి రోజు తీసుకోకూడదు. అలాగే మద్యానికి, మాంసాహారానికి దూరంగా ఉండాలి. పండ్లతో ఉపవాసం ఉండొచ్చు.

నలుపు రంగు పదార్థం: జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి నల్లరంగు పదార్థం సమర్పించకూడదు. నల్లటి వస్త్రాలు ధరించి భగవంతుణ్ని పూజించకూడదు. నలుపు రంగును వినియోగించడమనేది అశుభానికి, సంతాపానికి చిహ్నంగా పరిగణిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+