వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీరామ నవమి వ్రతము పూజా విధానం తెలుసుకోండి..!!

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గణపతిపూజ :- ఓం శ్రీగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వత్యే నమః. హరిహిఓమ్, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం|| శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||

శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|

ఆచ్యమ్య: :- ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, ,నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

SriRamanavami:know how to do the pooja and the procedure to perform pooja.

ప్రాణాయామము :- ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం.

మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ........ వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.

కలశారాధన :- ( కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి ఒక పుష్పం కొద్దిగా అక్షతలువేసి కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను )

శ్లో: కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే ; ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.

శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)

ప్రాణప్రతిష్ఠ :- మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |

ధ్యానం :- మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం||
శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

శుద్దోదక స్నానం :- మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః శుద్దోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |

వస్త్రం :- మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః| అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం :- మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః|| శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం :- మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం| ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |

అక్షతాన్ : - మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |
అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః
ఓం ఏకదంతాయనమః
ఓం కపిలాయనమః
ఓం గజకర్నికాయనమః
ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః
ఓం విఘ్నరాజాయనమః
ఓం గానాదిపాయనమః
ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయనమః
ఓం గజాననాయనమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హీరంభాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.

ధూపం :- వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.

దీపం :- సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం |
భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||

నైవేద్యం :- మం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా, ఓం అపానాయస్వాహః, ఓం వ్యానాయస్వాహః , ఓం ఉదానాయస్వాహః, ఓం సమానాయస్వాహః మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి ||

తాంబూలం :- ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం :- మం: హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి , మాధవ్యోసనీతి ఏకదా బ్రహ్మణ ముపహరతి , ఏకదైవ ఆయుష్తేజో దదాతి.
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||

మంత్రపుష్పం :- శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షణ నమస్కారం :- శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||

మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

శ్రీరామ నవమి వ్రత పూజాప్రారంభః

ధ్యానం :- శ్లో || కోమలాంగం విశాలాక్షం ఇంద్ర నేల సమప్రభం, దక్షిణాంగే దశరధం పుత్రాపేక్ష ణత త్పరం,
వృష్టంతో లక్ష్మణందేవం సచ్ఛత్రం కనక ప్రభం, పార్మ్యే భరత శత్రఘ్నె తాళ వృతక రావుభౌ,
అగ్రేవ్యగ్రం హనుమంతం రామానుగ్రహ కాంక్షిణం. ఓం శ్రీ రామచంద్రాయ నమః ధ్యాయామి - ధ్యానం సమర్పయామి

ఆవాహనం :- శ్లో || విశ్వేశం జానకీ వల్లభ ప్రభుం కౌసల్యా తనయం విష్ణుం శ్రీరామంప్రకృతే: పరం ||
సహస్ర శీర్షే త్యావాహనం, శ్రీరామాగచ్ఛ భగవన్ర ఘువీరన్న పోత్తమ ||
జానక్యా సహరాజేంద్రా సుస్థిర భవ సర్వదా రామభద్ర మహేష్వాస రావణాంతక రాఘవ
యావతన్నాజాం సమాప్యే హంతాత్సన్ని హితోభవ || రఘునాయక రాజర్షి నమోరాజీవ లోచన,
రఘునంద నమోదేవ శ్రీరామాభి మభోభవ || ఓం శ్రీరామచంద్రాయ నమః ఆవాహయామి.

ఆసనం :- శ్లో || రాజాధ రాజ రాజేంద్ర రామచంద్ర మహీపతే రత్న సింహాసనం తుభ్యం దాస్యామి స్వీకురు ప్రభో || పురుషయే వేద మిత్యాసనం || ఓం శ్రీ రామచంద్రాయ నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి.

అర్ఘ్యం :- శ్లో || పరిపూర్ణ పరానంద నమోర మాయవేధనే, గృహాణర్ఘ్యం మయాదత్తం కృష్ణ విష్ణోజనార్దన, త్రిపాదే త్యర్ఘ్యం.
ఓం శ్రీ రామచంద్రాయ నమః హస్తౌ: అర్ఘ్యం సమర్పయామి.

పాద్యం :- శ్లో || త్రైలోక్యపావనానంత నమస్తే రఘు నాయక, పాద్యం గృహాణరాజర్షే నమోరాజీవ లోచన ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః పాద్యం సమర్పయామి.

ఆచమనీయం :- శ్లో || నమస్సత్యాయ శుద్దాయ నిత్యాయ జ్ఞానరూపిణే, గృహాణాచమనంనాధ సర్వలోకైక నాయక, తస్మాద్విరా ఒచ్యాచ మనం,
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం :- శ్లో || నమశ్శ్రీ వాసుదేవాయ తత్వ జ్ఞాన స్వరూపిణే, మధుపర్కం గృహాణే దం జానకీ పతయే నమః
ఓం శ్రీ రామచంద్రాయ నమః మధుపర్కం సమర్పయామి

పంచామృత స్నానం :- శ్లో || పంచామృత మయానీతం పయోదది ఘ్రుతం మధు శర్క రాజల సంయుక్తం శ్రీ రామః ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ రామచంద్రాయ నమః పంచామృత స్నానం సమర్పయామి

శుద్దోదక స్నానం :- శ్లో || ఆపోహిష్టామ యోభువః స్థాన ఊర్జే దధాతన| మహేరణాయ చక్షసే| యోవశ్శివతమొరసః||
తస్యభాజయతెహనః వుశాతీరివ మాతరః| తస్మాదరంగమామవో యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
ఓం శ్రీ రామచంద్రాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి .

వస్త్ర యుగ్మం :- శ్లో: స్వర్ణాంచలం స్వర్ణ విచిత్ర శోభితం| కౌశేయ యుగ్మం పరికల్పితంమయా||
ఓం శ్రీ రామచంద్రాయ నమః వస్త్ర యుగ్మం సమర్పయామి

యజ్ఞోపవీతం :- శ్లో || బ్రహ్మ విష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మ సూత్రకం| గృహాణ భగవాన్ విష్ణో సర్వేష్ట ఫలదోభవ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఉపవీతం సమర్పయామి

గంధం :- శ్లో || శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం| విలేపన సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం||
ఓం శ్రీ రామచంద్రాయ నమః గంధాన్ సమర్పయామి

ఆభరణం :- శ్లో || స్వభావ సుందరాంగాయ నానా శక్త్యా శ్రయాయతే | భూషణాని విచిత్రాణి కల్పయా మ్యమరార్చిత ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః ఆభరణాన్ సమర్పయామి

పుష్ప సమర్పణ :- శ్లో || చామంతి కావకుల చంపక పాటలా| పున్నాగ జాజి రసాల మల్లికై| బిల్వ ప్రవాళ తులసీదళ పుష్పా త్వాం పూజయామి జగదీశ్వర|| ఓం శ్రీ రామచంద్రాయ నమః పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ :-

శ్రీ రామ చంద్రాయ - పాదౌ పూజయామి
రాజీవ లోచనాయ - గుల్భౌ పూజయామి
రావణాంత కాయ - జానునీ పూజయామి
వాచస్సతయే - ఊరూ పూజయామి
విశ్వరూపాయ - జంఘే పూజయామి
లక్ష్మణాగ్ర జాయ - కటిం పూజయామి
విశ్వమూర్తయే - మేడ్రం పూజయామి
విశ్వామిత్ర ప్రియామి - నాభి పూజయామి
పరమాత్మనే - హృదయం పూజయామి
శ్రీకంటాయ - కంటం పూజయామి
సర్వాస్త్రదారిణే - బాహూ పూజయామి
రఘుద్యహాయ - ముఖం పూజయామి
పద్మనాభాయ - జిహ్వం పూజయామి
దామోద రాయ - దన్తాం పూజయామి

శ్రీరామ అష్ట్తోత్తర శతనామావళి :-

ఓం శ్రీరామాయ నమః
ఓం రామభద్రాయ నమః
ఓం రామచంద్రాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం రాజీవలోచనాయ నమః
ఓం శ్రీమతే నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘుపుంగవాయ నమః
ఓం జానకివల్లభాయ నమః
ఓం జైత్రాయ నమః
ఓం జితామిత్రాయ నమః
ఓం జనార్ధనాయ నమః
ఓం విశ్వామిత్రప్రియాయ నమః
ఓం దాంతయ నమః
ఓం శరనత్రాణ తత్సరాయ నమః
ఓం వాలిప్రమదనాయ నమః
ఓం వంగ్మినే నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యవ్రతాయ నమః
ఓం వ్రతధరాయ నమః
ఓం సదాహనుమదాశ్రితాయ నమః
ఓం కోసలేయాయ నమః
ఓం ఖరధ్వసినే నమః
ఓం విరాధవధపందితాయ నమః
ఓం విభి ష ణపరిత్రాణాయ నమః
ఓం హరకోదండ ఖండ నాయ నమః
ఓం సప్తతాళ ప్రభేత్యై నమః
ఓం దశగ్రీవశిరోహరాయ నమః
ఓం జామదగ్న్యమహాధర్పదళనాయ నమః
ఓం తాతకాంతకాయ నమః
ఓం వేదాంత సారాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం భవరోగాస్యభే షజాయ నమః
ఓం త్రిమూర్త యే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః
ఓం త్రిలోకాత్మనే నమః
ఓం త్రిలోకరక్షకాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం దండ కారణ్యవర్తనాయ నమః
ఓం అహల్యాశాపశమనాయ నమః
ఓం పితృ భక్తాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం జితేoద్రి యాయ నమః
ఓం జితక్రోథాయ నమః
ఓం జిత మిత్రాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం వృక్షవానరసంఘాతే నమః
ఓం చిత్రకుటసమాశ్రయే నమః
ఓం జయంత త్రాణవర దాయ నమః
ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
ఓం సర్వదేవాద్ దేవాయ నమః
ఓం మృత వానరజీవనాయ నమః
ఓం మాయామారీ చహంత్రే నమః
ఓం మహాదేవాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం సర్వదే వస్తుతాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం మునిసంస్తుతాయ నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహొదరాయ నమః
ఓం సుగ్రీవే ప్సిత రాజ్యదాయ నమః
ఓం సర్వ పుణ్యాదేక ఫలినే నమః
ఓం స్మ్రుత స్సర్వోఘనాశనాయ నమః
ఓం ఆది పురుషాయ నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం మహా పురుషాయ నమః
ఓం పుణ్యోద యాయ నమః
ఓం దయాసారాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం స్మితవక్త్త్రాయ నమః
ఓం అమిత భాషిణే నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం రాఘవాయ నమః
ఓం అనంత గుణ గంభీరాయ నమః
ఓం ధీరోదాత్త గుణోత్త మాయ నమః
ఓం మాయామానుషచారిత్రాయ నమః
ఓం మహాదేవాది పూ జితాయ నమః
ఓం సేతుకృతే నమః
ఓం జితవారాశియే నమః
ఓం సర్వ తీర్ద మయాయ నమః
ఓం హరయే నమః
ఓం శ్యామాంగాయ నమః
ఓం సుంద రాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పీత వాసనే నమః
ఓం ధనుర్ధ రాయ నమః
ఓం సర్వయజ్ఞాధీపాయ నమః
ఓం యజ్వినే నమః
ఓం జరామరణ వర్ణ తాయ నమః
ఓం విభేషణప్రతిష్టాత్రే నమః
ఓం సర్వావగునవర్ణ తాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం సచిదానందాయ నమః
ఓం పరస్మైజ్యోతి షే నమః
ఓం పరస్మై ధామ్నే నమః
ఓం పరాకాశాయ నమః
ఓం పరాత్సరాయ నమః
ఓం పరేశాయ నమః
ఓం పారాయ నమః
ఓం సర్వదే వత్మకాయ నమః
ఓం పరస్మై నమః
శ్రీ రామాష్టోత్తర శత నామావళి సమాప్తమ్

ధూపం :- శ్లో || వనస్పతి రసోద్భూతో గంధాద్యో గంద ముత్తమ రామచంద్ర మహీపాల ధూపోయం ప్రతిగ్నహ్యతాం యత్పురుష మితి ధూపం. ఓం శ్రీ రామచంద్రాయ నమః ధూప మాఘ్రాపయామి.

దీపం :- శ్లో || జ్యోతిషాం పతయే తుభ్యం నమోరామాయ వేధసే, గృహానదీ పకం చైవ త్రైలోక్య తిమిరాపహం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి

నైవేద్యం :- శ్లో || ఇదంది వ్యాన్న మమ్రతంర సైషజ్భి స్సమన్వితం, రాచ మంద్రేశ నైవేద్యం సీతాశ ప్రతిగృహ్యతాం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః నైవేద్యం సమర్పయామి

తాంబూలం :- శ్లో || నాగవల్లీ దళైర్యక్తం పూగీ ఫల సమన్వితం, తాంబూలం గృహ్యతాంరామ కర్పూరాది సమన్వితం ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం :- శ్లో: నృత్త్యైర్గి తైశ్చవా ద్యైశ్చ పురాణపట నాదిభి: రాజో పచారైరభి లైస్సంతుష్టోభవ రాఘవ ||
మంగళార్దం మహీపాల నీరాజన మిదంహరే; సంగ్రహాణ జగన్నాధ రామచంద్ర నమోస్తుతే కర్పూర నీరాజనం ||

మంత్ర పుష్పం :- శ్లో || సర్వలోక శరణ్యాయ రామ చంద్రాయ వేదసే, బ్రహ్మనందైక రూపాయ సీతాయ|| పతయే నమః యజ్ఞే నేతి పుష్పాంజలి: ||
ఓం శ్రీ రామచంద్రాయ నమః యధాశక్తి మంత్ర పుష్పం సమర్పయ

నమస్కార :- శ్లో: నమోదేవాది దేవాయ రఘునాధాయ, చిన్మయానంద రూపాయ నీతాయః పతయే నమః సప్తా స్యాసన్నితిన మస్కారః

పూజాఫల సమర్పణమ్ :- శ్లో || యస్యస్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు, యాన సంపూరతాంయాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర, యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
అనయాధ్యానావాహనాది షోడశో పచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీరామ సుప్రీతస్సు ప్రసన్నో వరదో భవతు.

వ్రత కధా ప్రారంభము:-

1. శివ భక్తుడైన అగస్త్య మహర్షి సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ ' సుతేష్ణ మునీ ' నీకు నేను ఒక రహస్యము చెప్పెదను. అని ఈ విధముగా చెప్పుట మొదలు పెట్టెను.

2. చైత్ర మాసమున శుక్ల పక్షమినాడు సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములచే ఆరాధించి పురాణమును పటించి జాగారణముచేసి మరునాడు ఉదయముననే కాలకృత్యములు, నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తి యుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి పాయసముతో అన్నము చేసి పేద వారిని, బంధువులను తృప్తి పరిచి, గోవు. భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యా పుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింపజేయవలెను. ఇలా శ్రీ రామ నవమి వ్రతము భక్తిగా ఆచరించు వాని జన్మాంతరముల పాపములన్ని నశించును. ఇంకా సర్వోత్తమ మైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపర లొకములందు భోగమును, మోక్షమును కలిగించునది. కావున మహాపాపైననూ శుచియై ఈ వ్రతమును ఆచరించుటచే జన్మజన్మల పాపములన్ని జ్ఞానాగ్నిచే నాశనము అగుటచే లోకాభిరాముడగు శ్రీరామునివలె అన్ని లోకములలోను ఉత్తముడై వెలుగును.

3. శ్రీ రామనవమి వ్రతము అన్నిటి కంటే ఉత్తమమైన ఈ వ్రతము చేయక ఇంకే వ్రతము చేసిన సఫలముకాదు. కావున ఈ వ్రతము ఒక సారి చేసి, భక్తితో ఆచరించినచో వారి మహాపాపములు అన్నియూ తొలగి కృతార్దులు అగుదురు. అందువలన నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజా విధనాము చేత ఆచరించువాడు ముక్తుడు అగును. ఈతని పలుకులు విని సుతేక్షుణుడు ఇలా అడుగు చుండెను. ఓ లోపాముద్రావతీ! ఎప్పుడూ ధనములేని వారైన మానవులకు సులభమైన ఉపాయము చెప్పుమనగా ఆగస్త్యుడు ఇట్లు పలుకుచున్నాడు.

4. ఓ సుతేక్షణా! దరిద్రుడు అగు మానవుడు తనకు కలిగియున్న వరకూ స్వర్ణ రజతాదులలో దేనిచే నైననూ లోపము చేయక శ్రీరాముని ప్రతిమను చేయించి ఈవ్రతం చేసినచో ఆ వ్యక్తి యొక్క సర్వ పాపములు తొలగి పోవును. కావున ఎలాగైన ఈ వ్రతమును చేసి జానకీ కాంతుని పూజింపవలయును. ఈ వ్రతమును భక్తి కొలది చేయనివాడు రౌరవాది నరకములో పడును. అనిన విని సుతేక్షుడు ఓ అగస్త్య మహర్షి! శ్రీ రామ మూల మంత్ర ప్రభావము నాకు తెలుపవలెను. అనిన అగస్త్యుడు వివరించుచున్నాడు. సమస్తములైన రామ మంత్రములలోను రామ షడక్షరి అను మంత్ర రాజము ఉత్తమమని స్కాంద పురాణము. మోక్ష ఖండనములోని రుద్రగీత యందు శ్రీరాముని గూర్చి రుద్రుడు చెప్పుచున్నాడు.

5. ఓ రామ! మణి కర్ణిక ఒడ్డున మరణము పొందే మానవుని దక్షిణ కర్ణమున శ్రీ రామరామారామ' అను తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు తారక మంత్రము ఉపదేశించెను కావున నీవు ' తారక పర బ్రహ్మము ' అని పిలువబడుచున్నావు. కావున పరిశుద్దము పాపనాశనము యైన శ్రీరామ నవమీ వ్రతము శ్రద్ధా భక్తి గల మానవులకు చెప్ప తగినది. ఇంతే కాక బంగారు, వెండి, రాగి మొదలైన లోహములలో దేనితో నైననూ శ్రీరామ ప్రతిమను చేయించి అందు దేవుని ఆవాహనము చేసి, ఇంతకు ముందు చెప్పిన విధముగ పూజ చేసి, ఆ ప్రతిమ దగ్గర శ్రీరామ నవమి రోజున ఏకాగ్ర చిత్తుడై జపము చేయుచునుండి, మరునాడు పునః పూజ చేసి సంపూర్ణ భోజనము దానములచే సర్వ జనుల సంతోషింప చేయుటచే లోకాభి రాముడైన శ్రీరాముడు అనుగ్ర హించును. కావున మనుజుడు ధన్యుడు అగును. ఈ విధముగ పన్నెండు, సంవత్సరములు చేయుటచే సర్వపాపకర్మలు నశించిన వాడగును.

6. రామ మంత్రము తెలియనివాడు ఈ వ్రతము రోజున ఉపవాసము ఉండి శ్రీరామ స్మరణ చేసినచో అన్ని పాపములు పోయిన వాడగును. మంచి గురువు వద్ద మంత్రం తెలుసుకున్న వాడై ప్రతి క్షణం నిశ్చలమైన మనసు కలవాడై, మోక్షమును కోరినవాడై పుజించువాడు సర్వదోషములచే విడువబడి నాశనములేని శ్రీరామ తారక పర బ్రహ్మమును పొందునని అగస్త్య మహర్షి వివరించెను.

English summary
SriRamanavami:know how to do the pooja and the procedure to perform pooja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X