పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది: నవంబర్‌లో 13, డిసెంబర్‌లో 2.. శుభ ముహూర్తాలివే!

కార్తీక మాస ఆగమనంతో శుభకార్యాల కలకళలాడే సీజన్ రాబోతోంది. తెలుగువారికి అత్యంత పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 10 నుంచి ప్రారంభం కానుంది. చాతుర్మాస్య వ్రతాలు ముగిసి, శూన్య మాసాలు వీడటంతో శుభకార్యాలకు మార్గం సుగమమైంది. వివాహాలు, గృహప్రవేశాలు, నామకరణాలు, ఉపనయనాలు వంటి పవిత్రమైన వేడుకలు నిర్వహించుకోవడానికి ఈ సమయం ఎంతో అనుకూలమైనదని వేద పండితులు, పంచాంగకర్తలు వెల్లడించారు.

దీపావళి తర్వాత మేషరాశితో సహా ఈ 8 రాశులవారికి అపార ఆర్థిక లాభాలు ప్రకటించిన కుజుడు!
దీపావళి తర్వాత మేషరాశితో సహా ఈ 8 రాశులవారికి అపార ఆర్థిక లాభాలు ప్రకటించిన కుజుడు!

నవంబర్ నెలలో శుభ తేదీల వివరాలు
నవంబర్ నెలలో శుభకార్యాలకు భారీగా ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 13 రోజులను అనుకూలమైనవిగా పంచాంగకర్తలు నిర్ణయించారు. నవంబర్ 12, 13, 14, 15, 16, 17, 18, 20, 21, 22, 25, 26, 27 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇన్ని మంచి రోజులు వరుసగా రావడం వల్ల వివాహ వేడుకలు, గృహప్రవేశాలు ప్లాన్ చేసుకునే వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయంగా మారనుంది.

Subha Muhurthalu Karthika Masam Auspicious Dates November and December Marriage Muhurtham

డిసెంబర్ నెల ముహూర్తాలు
నవంబర్ అనంతరం డిసెంబర్ ప్రారంభంలో కూడా శుభకార్యాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయి. డిసెంబర్ 2, 3 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు వెల్లడించారు. మొత్తంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి 15 అత్యంత అనుకూలమైన శుభ తేదీలు అందుబాటులో ఉన్నాయి.

సుకర్మ యోగంతో 4 రాశులకు అదృష్టం.. మహాగౌరీ కటాక్షం!
సుకర్మ యోగంతో 4 రాశులకు అదృష్టం.. మహాగౌరీ కటాక్షం!

జ్యోతిష్య సలహాలు
అయితే ఇవి సాధారణ పంచాంగ ముహూర్తాలు మాత్రమేనని.. వ్యక్తిగత వివాహ లేదా గృహప్రవేశ ముహూర్తాలను నిర్ణయించేటప్పుడు వధూవరులు లేదా యజమానుల జాతక బలం, జన్మ నక్షత్రం, తిథి, వర్జ్యం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితుల సలహా తీసుకోవడం శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+