2024లో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు

2024 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. భూమికి - సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తే సూర్య గ్రహణం, చంద్రుడికి - సూర్యుడికి మధ్య భూమి ప్రయాణిస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. గ్రహణాలకి హిందువులు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.

ఈ సమయంలో శుభ కార్యాలు తలపెట్టరు. గర్భిణులు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. 2024లో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు ఏర్పడతాయి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.

Surya, chandra grahan timings in 2024 details here

తొలి సూర్య గ్రహణం: 2024లో తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. ఆ రోజు రాత్రి 9.12 గంటలకి ప్రారంభమై అర్థరాత్రి 1.25 గంటలకు ముగుస్తుంది. గ్రహణానికి 12 గంటల ముందు సుతక్ కాలం ప్రారభమవుతుంది. భారత్ లో కనిపించదు. మనకు సుతక్ కాలం కూడా చెల్లదు. పశ్చిమాసియా, నైరుతి ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువాల్లో తొలి సూర్యగ్రహణం కనిపిస్తుంది.

రెండో సూర్యగ్రహణం: రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడుతుంది. ఆరోజు రాత్రి 9.13 గంటలకి సూర్య గ్రహణం ఏర్పడి తెల్లవారుజామున 3.17 గంటల వరకు ఉంటుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు. సుతక్ కాలం చెల్లదు. అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. 2024 లో భారత్ లో రెండు సూర్యగ్రహణాలు కనిపించవు.

తొలి చంద్రగ్రహణం: కొత్త ఏడాదిలో పెనుంబ్రా చంద్రగ్రహణం మార్చి 25న వస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఆఫ్రికా, ఫసిఫిక్ మహాసముద్రంలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్ లో కనిపించకపోవడం వల్ల సుతక్ కాలం చెల్లదు.

రెండో చంద్రగ్రహణం: సెప్టెంబర్ 18 2024లో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కూడా భారత్ లో కనిపించదు. యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. సూతక్ కాలం పాటించాల్సిన అవసరం లేదు. రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు భారత్ పై ప్రభావం చూపలేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+