• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నమ్మకమే జీవితం: ప్రయత్నం, పరోపకారమే రక్ష, ఎలాగంటే..?

  |

  డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151 

  జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
  ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
  యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
  పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
  సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

  హైదరాబాద్: మనిషికి మనుగడకు నమ్మకం ఎంతో అవసరం. నమ్మకం లేకపోతే కష్టం. ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం నమ్మకంతోనే వ్యవహారం నడుస్తుంది. దీనికి ఉదహారణగా ఈ చిన్ని స్టోరీని గమనించండి. ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు.

  అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.

  నడుస్తున్నాడు.

  నీరు ఎక్కడా కనబడటం లేదు.

  తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. ఈ రాత్రి గడవదు.

  రేపు ఉదయం చూడను

  అని అనుకుంటున్న దశలో

  ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు.

  దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది.

  అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో ! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో !

  చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు.

  గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.

  The Astrologer told the story about belief is life.

  దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు.
  నీరు రావడం లేదు.
  శక్తినంతా ఉపయోగించి కొట్టాడు.

  అయినా ప్రయోజనం లేదు.

  నిరాశ నిస్పృహ ఆవరించాయి.

  ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది.

  కళ్లు మూసుకుపోతున్నాయి.

  ఒక మూలన సీసా కనిపించింది.

  దానిలో నీరు ఉంది.

  మూత గట్టిగా బిగించి ఉంది.

  మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు.

  దానికి ఒక కాగితం కట్టి ఉంది.

  దాని మీద ఇలా ఉంది.

  ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి.

  పంపు కొట్టండి. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి. అతడికి సందేహం కలిగింది.

  ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా?

  ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా?

  ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను ?

  చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు.

  అందులో పోసేస్తే మరణం ఖాయం.

  ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు.

  ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు.

  బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు.

  ఆశ్చర్యం! పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది.

  నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు.

  తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు.

  గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది.

  తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు. ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.
  ఇవ్వడం వల్ల మనం

  పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి.

  ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి.

  కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు.చావు బతుకుల మధ్య
  ఇక్కడ తర్కం

  ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ?

  రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే....
  మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు.

  తర్వాత...? అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి.

  తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై ఉండ్డొచ్చు.

  వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి ఉండొచ్చు.

  కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్.

  గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో నమ్మకం ముఖ్యం ! నమ్మడమే శ్రేయస్కరం. మనం ఇవ్వకుండా
  దేనినీ పొందలేము.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Astrologer told the story about belief is life.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more