బాత్‌రూం కమోడ్‌కు కచ్చితంగా వాస్తు ఉండాలి.. ఒకసారి చూసుకోండి
మనం నివసించే ప్రదేశం ఎలా ఉండాలి? ఏవిధంగా నిర్మాణం జరుపుకుంటే ఇబ్బందులు ఎదురుకావు? ఎటువంటి నియమాలు పాటించాలనేదాన్ని వాస్తు తెలియజేస్తుంది. అలాగే ఏదైనా దోషాలున్నా వాటికి పరిహారం కూడా ఉంటుంది. ప్రధానంగా బాత్ రూంలో కమోడ్ ఎలా ఉండాలి? వాటికి కూడా వాస్తు ఉంటందా? ఉంటే ఎటువైపు ఉండాలి, మనం ఎటువైపు కూర్చోవాలి? అనేవాటిని కూడా తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం బాత్ రూం నిర్మాణాన్ని, కమోడ్ నిర్మాణాన్ని ఎలా నిర్వచిస్తోందనే విషయాన్ని కూడా విపులంగా తెలుసుకుందాం.
కమోడ్ మీద కూర్చుంటే ముఖం దక్షిణం వైపు లేదంటే ఉత్తరం వైపు ఉండాలి.
తూర్పు, పడమర దిశలను చూసేలా ఉండకూడదు.
సూర్యుడు ఆ దిశలోనే ఉంటాడు కాబట్టి.
కమోడ్ ను వాయువ్యం, ఆగ్నేయం మూలలకు మార్చుకోవాలి.
బాత్ రూం తలుపు నైరుతి మూలకు ఉండకూడదు.
బాత్ రూంలో కాలు జారిపడి, తలకు దెబ్బ తగిలి చనిపోయినవారు ఎందరో ఉన్నారు.
బాత్ రూం కట్టేటప్పుడు అందుకే వాస్తు చూపించుకొని కట్టుకోవాలి.

తూర్పు వైపు కమోడ్ ఉంటే అనారోగ్యం, మానసిక ఆందోళన కలుగుతుంది.
ఆర్థికంగా అనేక ఇబ్బందులు కలుగుతాయి.
వాయువ్యం అనేది సరైన దిశ.
వాయువ్యం వీలుకాకపోతే పశ్చిమంలో ఏర్పాటు చేయాలి.
దక్షిణ దిశలో ఉన్నా.. నైరుతికి దగ్గరగా ఉండకూడదు.
ఈశాన్యం మూల ఉండకూడదు.
నైరుతిలో కమోడ్ ఉంటే నిర్ణయాలు తీసుకోవడంలో ఇక్కట్లు ఉంటాయి.
ఇంటి మధ్యభాగంలో అసలు ఉండకూడదు.
కమోడ్ నేలకంటే ఎత్తులో ఉండాలి.
టాయిలెట్ తలుపు ఎప్పుడూ మూసివుండాలి.
గాలి బయటకు వెళ్లడానికి ఉత్తరం లేదంటే పడమరలో చిన్న కిటికీ ఉండాలి.












Click it and Unblock the Notifications