లక్కీ నంబర్ 4 అయితే మీరెలా ఉంటారు?

నాలుగు సంఖ్యకు రాహువు అధిపతి. ఇది చాలా బలమైన గ్రహం. ఈ లక్కీ నెంబర్ గల వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసుకోవాలని ఉందా...

ఏ నెలలోనైనా, సంవత్సరములో నైనా, 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన స్త్రీ పురుషులంతా రాగు జాతకులు 4 వ సంఖ్యకు రాహువు అధిపతి. ఇది చాలా బలమైన గ్రహం. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా తొమ్మిది గ్రహాలలో కూడా రాహువే బలశాలి. సూర్యజాతకులకు, రాహు జాతకులకు సంబంధము ఉంది. దాదాపు ఇవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులాంటివి. ఇద్దరికి పోలికలుంటాయి. అయినను వేరు, వేరు గ్రహాలు.

4వ సంఖ్యలో పుట్టిన వారికి వారి ప్రత్యేక మనస్థత్వం ఉంటుంది. వీరి ఆలోచనలు ప్రతీ విషయంలో ఇతరులకు విరుద్ధంగా ఉంటాయి. వాదన లలో కూడా వారు ఇతరులకు పూర్తి విరుద్ధంగా మాట్లాడుతారు. వారి పోట్లాటకు అర్ధం ఉండదు. వీరికి శతృత్వం ఎక్కువ. లోకం దారి ఒకటయితే వీరి దారి ఇంకొక మార్గంలో ఉంటుంది. ఇతరులతో ఏకీభవించలేరు. ఋజువు ఉంటే తప్ప ఏ విషయాన్ని నమ్మరు. వీరిలో చాలా మందికి దేవునిపై నమ్మకం ఉండదు.

ప్రకృతికి విరుద్ధమైన ఆలోచనలు, నిర్ణయాలు చేస్తుంటారు. ఆచారాలు, ధర్మాల పై వీరికి నమ్మకం ఉండదు. క్రమశిక్షణ నియమాలు పాటించలేరు. చట్టానికి లోబడి ఉండటం, చట్టప్రకారం నడవటం, క్రమశిక్షణ పై గౌరవం వీరికి ఉండదు. వారికి ఎలా తోచితే అలాగే చేస్తారు. చట్టాలకు, నియమ నిబంధనలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం వీరికి నచ్చదు. వీరి క్రొత్త ఆలోచనలు, క్రొత్త నియమాలు పాటించటానికి ఇష్టపడతారు.

The features having lucky number four

సామాజికంగా కూడా వీరి ఆలోచనలు ఇతరులకు విరుద్ధంగా ఉంటాయి. కుటుంబంలో అందరితో కలిసిపోతారు. ఈ 4వ సంఖ్య రాహుజాతకులు చాలా మొండివారు. జూన్‌ 21 నుండి జులై 27 వరకు, మధ్యకాలంలో పుట్టిన వారికి రాహుజాతకుల లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఇతరులతో తొందరగా స్నేహం చేయరు. 1, 2, 7 సంఖ్యలలో పుట్టిన వారితో వీరి స్నేహం బాగానే ఉంటుంది.

రాహు జాతకులకు కోపం, పట్టుదల ఎక్కువ. శక్తికి మించిన ఆలోచనలు, ప్రయత్నములు చేస్తారు. వీరు మనస్సుకు ఎలా తోచితే అలా చేస్తారు. వీరు ఇతరులకు సహాయం కూడా చేస్తారు. క్రొత్త విషయాల పై ఆశక్తి ఎక్కువ వీరికి వీరు ప్రాణం ఇవ్వగలరు. ప్రాణం తీసుకోగలరు.

వీరిలో చాలా మంది చిన్న వయస్సులో చెడు స్నేహాలు చేసి, అల్లరి చిల్లరగా తిరిగి చెడిపోతారు. కాని మరల లోకంను గుర్తించి మంచి లైఫ్‌ సాధించుకొంటారు. సమాజంలో గెలిచి నిలబడగలరు. వీరికి ధైర్యం ఎక్కువ. తొందరపాటు ఎక్కువ. వీరి స్నేహం అతి కొద్ది మందితోనే ఉంటుంది.

వీరికి ఆశ ఎక్కువ. లాభం లేని పనిచేయరు. సెక్స కోరికలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ విషయాన్ని అనుమానిస్తారు. వీలును బట్టి ప్రవర్తిస్తారు. వీరికి గౌరవము, అపనిందలు సమానంగా ఉంటాయి. అయినను వీరు దేనిని లెక్క చేయరు. వారికి తోచిందే చేస్తారు.

గృహజీవితం, ఇతర విషయాలలో కూడా వీరి జీవితం అంత సంతృప్తి కరంగా ఉండదు. వీరి జీవితంలో అనేక కష్టములు, సమస్యలు చవి చూస్తారు. సాఫీగా ఉండదు. తమకు తోచిన పనియే చేస్తారు. ఇతరుల మాటను, సలహాలను గౌరవించరు, పాటించరు. వీరు ధాన ధర్మాలు చేయరు. కాని చేస్తే దానికి అంతు ఉండదు. వీరికి ఎన్ని సమస్యలున్నా, కష్టములున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఓటమిని అంగీకరించరు. రాజీపడరు. తల వంచరు. పోరాడుతారు. పోరాటమే వీరి లక్ష్యం.

4, 13, 22, 31వ తారీఖున పుట్టిన రాహు జాతకులు తారీఖుతో పాటు ఆదివారము నాడు, జూన్‌, జులై నెలలో పుట్టిన వీరి లక్కీ నెంబర్‌ కూడా సంఖ్య 4 వచ్చిఉండి, వీరికి వీరి అరచేతిలో రాహుస్థానం బలంగా ఉంటే వారికి రాహు బలం చాలా ఎక్కువగా ఉండి రాహుజాతకుల లక్షణాలు పూర్తిగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+