ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఆరోజే.. ప్రభావం ఎలా అంటే
సనాతన ధర్మాన్ని విశ్వసించే వారికి చంద్రగ్రహణం ఎంతో ప్రధానమైనది. చంద్ర గ్రహణం అనగానే ప్రజలు సూతకం గురించి ఆలోచిస్తారు. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఏప్పుడు ఏర్పడుతుందనే ప్రశ్న అందరిలో ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజు మార్చి 25న తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది.
ఇది దాదాపు 4 గంటలు ఉంటుంది. ఉదయం 10 గంటల 41 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యారాశిలో ఉండనున్నాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం, చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకం ప్రభావం ఉంటుంది. హోలీ రోజు చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంతోపాటు ఇతర ప్రదేశాల్లో కనిపిస్తుంది.

మనదేశంలో ఇది కనిపించని కారణంగా సూతకం చెల్లదు. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న, రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న ఏర్పడుతుంది. రెండో గ్రహణం ఉదయం 6.12 గంటలకు ప్రారంభమై ఉదయం 10.17 గంటల వరకు ఉంటుంది. రెండోది కూడా ఇండియాలో కనపడదు. అందువల్ల సూతకం చెల్లదు. గ్రహణం సమయంలో మతపరమైన పనులు, శుభకార్యాలు చేయకూడదనే నిషేధం ఉండదు. ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా,
ఉత్తర ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. మనదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం కూడా చెల్లదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications