ఈ లక్కీ నెంబర్ ఉండే వ్యక్తి ఎలా ఉంటాడు?

మూడు లక్కీ నెంబరు గల వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటానే విషయాన్ని జ్యోతిష్కుడు వివరించారు. ఏం చెప్పారో చదవండి.

గురువు అధిపతి ఏ నెలలోనైనా, సంవత్సరములో నైనా పుట్టిన స్త్రీ పురుషులంతా 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారందరూ గురు జాతకులు. 3వ సంఖ్యకు గురువు అధిపతి. ఈ గురువు సంఖ్యకు చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా ఏ వ్యక్తి అయినా గురు బలం ఉన్నపుడే తన వృత్తిలో రాణించగలడు. గురు బలం లేకుంటే రాణింపు ఉండదు. అందువల్ల బలం చాలా అవసరం ప్రతి సంఖ్య వారికి కూడా!

అరచేతిలో కూడా గురు బలం ఉంటే ఆ వ్యక్తికి మంచి ఫలితములుంటాయి. 3, 12, 21, 30 తేదీలలో వీరు చేయు ప్రయత్నములు మంచి ఫలితాలనిస్తాయి. వీరికి వారి జీవితంలో ఎక్కువగా ఈ తేదీలలోనే మంచి సంఘటనలు జరుగుతాయి.

3, 6, 9సంఖ్యల మధ్య మంచి స్నేహ సంబంధాలుంటాయి. వీరికి మనస్తత్వాలు కలుస్తాయి. ఈ 3, 6, 9 సంఖ్యలలో పుట్టిన వారు కలిసి ఉండగలరు.

The future of the person having 3 as lucky number

3, 12 21, 30తేదీలలో జన్నించిన స్త్రీ, పురుషులందరూ ఏ నెలలో జన్మించిననూ గురు జాతకులే కాని వారు ఫిబ్రవరి 19 నుండి మార్చి 27 మధ్య కాలంలో పుట్టిన వారందరికి గురు బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారికి గురు బలం ఎక్కువగా లాభం చేస్తుంది.

నవంబర్‌ 21 నుండి సెప్టెంబర్‌ 27 మధ్య కాలంలో పుట్టిన వారికి కూడా గురు బలం ఎక్కువగా ఉండటం వల్ల వీరికి గురు జాతకులకు ఉండవలసిన గుణములు, ఫలితములు ఎక్కువగా ఉంటాయి. వీరు గురువారం రోజున పుట్టినచో, వీరి అదృష్ట సంఖ్య కూడా 3 వచ్చినచో వీరికి తిరుగుండదు. అనుకొన్న పనిని సాధించుకొంటారు.

3వ సంఖ్య గురు జాతకులు 1 వ సంఖ్య వారి వలెనే స్వతంత్ర స్వభావాలు కలిగి ఉంటారు. స్వయం కృషిపై అభివృద్ధి సాధించుకొంటారు. కృషిని నమ్ముకొని క్రమశిక్షణతో పనులు చేస్తారు. ఓటమిని అంగీకరించరు. గెలుపు వారి లక్ష్యం.
గురుజాతకులు ఎప్పుడూ మొదట స్థానాన్ని కోరుకుంటారు. రెండవ స్థానాన్ని ఇష్టపడరు. వారు ప్రపంచములో అభివృద్ధి పొందాలని, గెలుపు పొందాలని కోరుకుంటారు. ఇతరులపై పెత్తనం చేలాయించాలని కోరుకుంటాయి. వీరు పెత్తనం, చెలాయించటంలో వీరికి వీరే సాటి. అన్ని విషయాలలో క్రమశిక్షణ, క్రమపద్ధతిని ఇష్టపడతారు. ఇతరులకు లొంగి ఉండలేరు. ఇతరుల మాటను పాటించరు. కాని వారి మాటలకు వారు కట్టుబడి ఉంటారు.

గురు జాతకులలో వ్యాపార రీత్యా బాగా అభివృద్ధి పొందిన వారు కూడా ఉన్నారు. వృత్తులలో, క్రొత్త విషయాలలో కూడా రాణిస్తారు. గవర్నమెంట్‌ ఉద్యోగాలలో, మిలిట్రీలలో ఉన్నతమైన ఉద్యోగస్థులున్నారు.బాధ్యతగల పదవులలో వీరు బాగా రాణిస్తారు. వీరు వీరి ఆలోచనలను ధైర్యంగా పాటిస్తారు. ఇతరుల అభిప్రాయాలను లెక్క చేయరు. అందువల్ల వీరికి ఇతరులతో శతృత్వం కూడా తప్పదు.

వీరికి ఆత్మాభిమానం, గర్వం ఉంటాయి. అనుకొన్నది చేసితీరుతారు. ఎలాంటి సమస్యలను కూడా లెక్క చేయరు. వారికి వారి పైన, వారి పనులపై నమ్మకం చాలా ఎక్కువ. గురు జాతకులు సమాజంపై పెత్తనం చెలాయిస్తారు. సమాజమునకు సేవ కూడా చేస్తారు.

వీరికి మంచి తెలివి తేటలు, గ్రహణ శక్తి దూరదుష్టి ఉంటాయి. దైవ కార్యములయందు అభిరుచి కలిగి ఉంటారు. వీరికి ఆశ ఎక్కువ. ప్లాన్లు వేస్తారు. శక్తికి మించిన ఆలోచనలు, ప్రయత్నములు చేస్తారు. వీరితో స్నేహం ఎంత మంచిదో విరోధం కూడా అంతే ఇబ్బందులు తెస్తుంది. అయితే ధర్మబుద్ధి, న్యాయమైన గుణము ఉంటుంది.

స్వతంత్ర జీవనము, స్వేచ్ఛగల జీవితాన్ని ఇష్టపడతారు. వీరికి మానసిక కష్టములుంటాయి. వీరు చాలా మంచి హృదయం కలవారు. ఇతరులకు సహాయం చేస్తారు. దైవ కార్యములకు అంతే ఖర్చు చేస్తారు వీరు ఎప్పుడూ పనిలో నిమగ్నమయు ఉంటారు. తీరిక లేని జీవితం వీరిది.

వీరు ఏ పనినైనా వెంటనే ప్రారంభిస్తారు. ఆ పని అయ్యేంత వకురు నిద్రపోరు. రాజీ పడరు. విజయం సాధిస్తారు. దైవం పైన నమ్మకం, దైవ కార్యక్రమాలు చేస్తారు. మంచి పేరు, మంచి పలుకుబడి సాధించుకొంటారు. గురుడు యుద్ధకారకుడు. సైనికుని వలె ధైర్యంగా శతృవులను ఎదుర్కొంటారు. వీరితో కలహాలు పెట్టకోవచ్చు. లొంగి ఉండలేరు.

వినయ విధేతలను వీరు వ్యక్తి యొక్క అసమర్థతగా భావిస్తారు. అన్యాయంను వీరు ఎన్నడును అంగీకరించరు. వీరు అన్ని విషయములలో మంచి సమర్థులు. వీరు తమ కుటుంబానికే గాక చేయు వృత్తికి, చేయు శాఖలకు మంచి పేరు, గౌరవం తెస్తారు.

విద్య వీరు మూడు భాషలు నేర్చుకొనే అవకాశం ఉంది. నావికా, సైనిక, జ్యోతిష, కవిత్వ, సాహిత్య రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు. పుస్తకాలు చదువుతారు. కళల యందు అభిరుచి ఉంటుంది.

న్యాయ శాస్త్రము, టెక్నికల్‌ వృత్తులలో రాణించగలరు. జ్యోతిష్యం, గణితం లో వీరికి మంచి ప్రావీణ్యత ఉండును. విద్యలో వీరికి మంచి అభివృద్ధి, మంచి ఉన్నత స్థాయి ఉంటుంది. ఉద్యోగము - టీచర్‌, ప్రభుత్వ ఉద్యోగాలు బ్యాంక్‌ ఉద్యోగస్థులుగా, ప్లీడర్లుగా సంపాదన ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+